Peru Earthquake: పెరూలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రత..
Earthquake: పెరూలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5:52గంటల సమయంలో జరిగింది.
Peru Earthquake: పెరూ దేశంలో ఆదివారం భారీ భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.5తీవ్రత నమోదైంది. బరాన్కా(Barranca)కు ఉత్తరాన 42 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.52 గంటలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు పేర్కొంది. భారీ భూంకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ఎక్కువ లోతులో సంభవించటం వల్ల పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం కలగలేదు.
భూకంపం 131 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు పెరూ(Peru)లోని జియోఫిజికల్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఈ భూప్రకంపనలకు 16వ శతాబ్దానికి చెందిన ఓ పాత కాథోలిక్ ఆలయ టవర్ కుప్పకూలింది. ఇతర ప్రాంతాల్లో కొన్ని చర్చ్‌లు శిథిలమయ్యాయి.. ఈ ఘటనలో 75 ఇళ్లు ధ్వంసం కాగా...10 మందికి గాయాలయ్యాయి.
Also Read: Tamil Nadu Earthquake Today: తమిళనాడులోని వేలూరులో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రత నమోదు
పెరువియన్ అమెజాన్ (Peruvian Amazon)లోని శాంటా మారియా డి నీవాకు తూర్పున 98 కిలోమీటర్ల దూరంలో చాలా తక్కువ జనాభా ఉన్న ప్రాంతంలో భూకంప కేంద్రం(Earthquake epicenter) ఏర్పడినట్లు తెలుస్తోంది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని యూఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ స్పష్టం చేసింది. పెరూ దేశం రింగ్ ఫైర్(Ring of fire)లో ఉండటం వల్ల తరచూ భూకంపాలు సంభవిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 85 శాతం భూకంపాలు ఈ రింగ్ ఫైర్ లోనే చోటుచేసుకుంటాయి. 2007 ఆగస్టు 15న పెరూలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతగా నమోదైంది. దీని వల్ల 500 మందికి పైగా మరణించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook