87 years old Amou Haji hasn't bathed in 67 years in Iran: సాధారణంగా ఈ భూప్రపంచంలో ప్రతిఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆహారం, పరిశుభ్రత విషయంలో. పరిశుభ్రతగా ఉండాలని కొందరు రోజుకు రెండు సార్లు స్నానం చేస్తారు. శీతాకాలం అయినా సరే రోజుకు ఒకసారైనా స్నానం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం 67 ఏళ్లుగా స్నానం (Bath) చేయకుండానే ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. ఇరాన్‌ (Iran)లోని దేజ్గా‌ అనే గ్రామంలో నివసిస్తున్న 87 ఏళ్ల అమౌ హజీ అనే వ్యక్తే 67 ఏళ్లుగా స్నానం చేయలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇరాన్‌కి చెందిన 87 ఏళ్ల అమౌ హజీ (Amou Haji) వృద్ధుడు 67 ఏళ్లుకు పైగా స్నానం చేయడం లేదు. అందుకు ఓ కారణం ఉంది. హాజీకి నీళ్లంటే చాలా భయం అట. స్నానం చేస్తే అనారోగ్యానికి గురవ్వుతాననే భయం.. అతడికి ఓ ఫోబియాగా (Water Phobia) మారింది. హాజీకి 20 ఏళ్ల వయస్సు ఉన్నపుడు ఈ ఫోబియా వచ్చిందట. అప్పటినుంచి అతడు స్నానం చేయడం మానేశాడు. ఒక్క నీటి చుక్క కూడా తన శరీరంపై పడకుండా జాగ్రత్తపడుతున్నాడు. తలపై యుద్ధంలో సైనికులు పెట్టుకొనే హెల్మెట్ అతడు ధరిస్తాడు. చలికాలంలో అది అతడిని వెచ్చగా ఉంచుతుందట.


Also Read: T20 World Cup 2022 Schedule: టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?! అభిమానులకు పండగే పో!


ఇక అమౌ హజీ ఆహారపు అలవాట్లు వింటే షాక్ అవ్వాల్సిందే. హజీ కేవలం చనిపోయిన జంతువుల కుళ్లిన మాంసాన్ని తినడానికి మాత్రమే ఇష్టపడతాడు. అతను పంది కొక్కులు, కుందేళ్లను తింటూ.. నీటి కుంటల్లో నీరు తాగుతూ జీవిస్తున్నాడు. గత 67 ఏళ్లుగా అతని జీవన శైలి ఇదే. ఇక హజీకి స్మోకింగ్ అంటే చాలా చాలా ఇష్టం. అయితే అతడు పొగాకు కాకుండా జంతువుల మలాన్ని (Amou Haji Smokes Dried Animal Feces) పీలుస్తాడు. బాగా ఎండిపోయిన మలాన్ని తుప్పు పట్టిన పైపులో వేసుకుని హజీ స్మోక్ చేస్తాడు. హజీ స్నానం చేయకున్నా.. రోజుకు ఐదు లీటర్ల నీళ్లు మాత్రం తీసుకుంటాడు.


[[{"fid":"220391","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]అమౌ హజీ విచిత్ర జీవన శైలిని చూసి ఆశ్యర్యపోయిన దేజ్‌గా గ్రామస్తులు అతడి కోసం ఒక పూరి గుడిసెను నిర్మించి ఇచ్చారట. అయితే అతడు గుడిసెలో ఉండకుండా సొరంగాలు తవ్వి అందులోనే నివసిస్తున్నాడు. ఇక హాజీ తన జుట్టును కత్తెరతో కాకుండా నిప్పుతో కత్తిరించుకుంటాడు. దాంతో హాజీని ప్రపంచంలోనే అత్యంత అపరిశుభ్ర వ్యక్తి (World Dirtiest Man)గా పరిగణిస్తున్నారు. హజీకి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆరోగ్యంగా ఉండడంతో శాస్త్రవేత్తలు షాక్ తిన్నారు. 67 ఏళ్లుగా స్నానం చేయకపోయినప్పటికి అతని శరీరంలో ఎలాంటి పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు లేవట. 


Also Read: Amar Jawan Jyoti: అమర జవాన్ జ్యోతి ఆరిపోనుందా.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం...


[[{"fid":"220389","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]][[{"fid":"220390","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook