Mike Tyson Rape: 90స్ లో రేప్ చేశాడు..మైక్ టైసన్ నుంచి 40 కోట్లు ఇప్పించమంటున్న మహిళ!
Mike Tyson Rape: తనను దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ రేప్ చేశాడని, 90లలో తనను అతని కారులోనే రేప్ చేశాడు అంటూ ఒక మహిళ ఇప్పుడు కోర్టుకు ఎక్కింది, తనకు ఐదు మిలియన్లు అంటే 40 కోట్లు ఇప్పించాలని కోరింది. ఆ వివరాలు
Rape Case on Mike Tyson: సాధారణంగా రేప్ లేదా లైంగిక వేధింపులు జరిగితే వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు ఆడవారు, కానీ ఈ మధ్య ఇటు బాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎప్పుడో జరిగిన విషయాలకు ఇప్పుడు స్పందిస్తున్నారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్, హెవీవెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ గురించి బుధవారం ఉదయం ఒక పెద్ద వార్త అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది. అదేమంటే 1990ల ప్రారంభంలో తనపై మైక్ టైసన్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపించింది.
తాజాగా మహిళ చేసిన ఫిర్యాదు ప్రకారం న్యూయార్క్‌లోని అల్బానీలోని ఓ నైట్‌క్లబ్‌లో ఈ ఇద్దరూ కలుసుకున్నారట. టైసన్ ఆల్బనీ నైట్‌క్లబ్‌లో కలిసిన తర్వాత తనపై లిమోసిన్‌లో అత్యాచారం చేశాడని, ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా తాను చాలా గాయపడ్డానని ఆమె చెప్పింది. ఇక తన ప్రస్తుత శారీరక స్థితికి, మానసిక క్షోభకు సైతం అదే సంఘటన కారణమని సదరు మహిళ ఆరోపించింది. ఇలా తనను క్షోభకు గురి చేసినందుకు 5 మిలియన్ అమెరికన్ డాలర్లు తనకు చెల్లించాలని డిమాండ్ చేసింది.
అయితే మహిళ దాఖలు చేసిన ఫిర్యాదు అఫిడవిట్‌లో ఈరోజు జరిగింది అనే తేదీ పేర్కొనలేదు, ఈ ఘటన కేవలం 1990ల ప్రారంభంలో జరిగిందని పేర్కొంది. నిజానికి ఇండియానాపోలిస్‌లో టైసన్ తనపై అత్యాచారం చేశాడని డిసైరీ వాషింగ్టన్ అనే మహిళా మోడల్ కూడా ఆరోపించింది. ఫిబ్రవరి 10, 1992న, వాషింగ్టన్‌పై అత్యాచారం చేసినందుకు టైసన్ మూడేళ్ల జైలుశిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది. ఇక తాజా ఫిర్యాదులో తాను టైసన్ లిమోసిన్ కారులోకి ఎక్కినప్పుడు ఆయన తనను అనుచితంగా తాకడం ప్రారంభించాడని, తనను ముద్దు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నించాడని పేర్కొంది.
ఆమె అతడిని పలుమార్లు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగలేదని ఆమెను బలవంతం చేసి అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఈ ఫిర్యాదును మొదట టైమ్స్ యూనియన్ ఆఫ్ అల్బానీ నివేదించింది కానీ ఆ మహిళ తన పేరు వెల్లడించవద్దని కోరింది. మహిళ మాటలను తాను నేరుగా నమ్మలేదని ఆమె తరపు న్యాయవాది డారెన్ సీల్‌బాచ్ ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. అయితే ఆ ఆరోపణలపై విచారణ జరిపినప్పుడు అవి చాలా వరకు నిజమని తేలిందని, మంగళవారం, ఈ విషయంపై టైసన్ ఏజెన్సీని సమాధానం కోరినట్లు చెప్పారు. హెవీవెయిట్ ఛాంపియన్ టైసన్ రింగ్ లోపల కింగే కానీ రింగ్ బయట ఆయన లైఫ్ మాత్రం ఎప్పుడూ వివాదాలతోనే ఉండేది. అతని మాజీ భార్య, నటి రాబిన్ గివెన్స్ కూడా విడాకుల సమయంలో టైసన్‌పై అనేక ఆరోపణలు చేశారు.
Also Read: Balakrishna Controversy:మాకేం వివాదం అనిపించలేదు.. ఇక లాగకండి.. ఎస్వీ రంగారావు మనవళ్లు వీడియో రిలీజ్!
Also Read: IPS Transfers: ఒకే దెబ్బకు తెలంగాణలో 91 మంది ఐపీఎస్‌ల బదిలీ.. అందుకేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook