ఆఫ్ఘనిస్తాన్‌లో కమాండర్లుగా, పోలీస్ అధికారులుగా పనిచేసే 20 మంది మహిళా ఆఫీసర్లకు భారత ప్రభుత్వం అదనపు శిక్షణ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో వారు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి రావడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం తాలిబన్లను ఎదుర్కోవడానికి పలువురు మహిళలు కూడా ఆర్మీలో చేరుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ - ఆఫ్ఘన్ బంధాలు మరింత పటిష్టపరచుకొనే ఉద్దేశంతో ఆ మహిళా కమాండర్లకు శిక్షణ ఇవ్వడం కోసం మన దేశ ఆర్మీ ముందుకొచ్చింది. అయితే సంప్రదాయ హిజాబ్ ధరించి మాత్రమే ఈ మహిళా కమాండర్లు భారత్‌లో శిక్షణ ప్రోగ్రామ్‌కు హాజరుకావడం గమనార్హం. భారత ఆర్మీ అధికారులు ఈ ఆఫ్ఘన్ మహిళా కమాండర్లకు ఆయుధాలను వాడడం, సిగ్నల్స్ గుర్తించడం, మ్యాపుల ఆధారంగా ప్రదేశాలను కనిపెట్టడం, ఆర్మీ రంగంలో ఆన్‌లైన్ వనరుల పాత్ర మొదలైన అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.