China and Talibans: ప్రపంచమంతా తాలిబన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే..చైనా మాత్రం సంబంధాలు నడుపుతోంది. చైనా తాలిబన్లతో ఏకంగా ద్వైపాక్షిక సంబంధాలే జరిపింది. అంతేకాకుండా అధికారికంగా మీడియాకు వెల్లడించిన విషయాలు మరింత చర్చనీయాంశమవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను(Afghanistan)ఆక్రమించిన తరువాత ఆ దేశంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. తాలిబన్ల ఆకృత్యాలపై వస్తున్న మీడియా కథనాలతో ప్రపంచమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే అటు చైనా మాత్రం ఆ తాలిబన్లతో సంబంధాలు ఏర్పర్చుకుంటోంది. కాబూల్‌లో చైనా తాలిబన్లతో ద్వైపాక్షిక సమావేశం(Bilateral Meet) నడపడం ద్వారా దౌత్య సంబంధాలు ఏర్పర్చుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల స్వతంత్య్ర నిర్ణయాన్ని, మెరుగైన భవిష్యత్ కోసం ఎంచుకున్న మార్గాన్ని చైనా గౌరవిస్తుందని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆఫ్ఘనీయుల నాయకత్వంలో ముందుకు సాగాలనుకున్నవారికి మద్దతుగా నిలుస్తామని చైనా ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి స్థాపన, దేశ పునర్నిర్మాణంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తామని చైనా వెల్లడించింది. ఆఫ్ఘన్‌తో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని..అయితే తమ మధ్య జర్చలు మాత్రం ఫలవంతంగా సాగాయని ప్రకటించుకుంది.


తాలిబన్లు(Talibans)..ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన అనంతరం ఆ దేశంలోని దౌత్య కార్యాలయాల్ని ఇండియా, అమెరికాలు మూసివేయగా..చైనా పాకిస్తాన్, రష్యాలు మాత్రం తెరిచి ఉంచాయి. తాలిబన్లతో స్నేహపూర్వ చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా(China)ప్రకచించింది. ఇప్పటికే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో తాలిబన్ ఛీఫ్ ముల్లా అబ్దుల్లా సమావేమయ్యారు.  


Also read: Joe Biden: ఆగస్టు 31 లోగా బలగాల ఉపసంహరణ, తాలిబన్ల సహకారం అవసరమే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook