Afghanistan: నిరసనలతో హోరెత్తుతున్న వైట్ హౌస్..`బైడెన్.. ప్రతిచావుకు నువ్వే కారణం`: ఆఫ్ఘన్ జాతీయులు
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆక్రమించటంతో అమెరికా శ్వేతసౌధం ముందు ఆఫ్ఘన్ జాతీయులు నిరసనలు చేస్తున్నారు. `బైడెన్ నువ్వు మమ్మల్ని మోసం చేసావంటూ` ఆఫ్ఘనిస్థాన్ జాతీయుల ఆందోళనలు.
అమెరికా అండ కలిగిన ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) మరోసారి తాలిబన్ల ఆదీనంలోకి వెళ్ళటం ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తుంది.
ఆఫ్ఘనిస్థాన్ లో రెండు దశాబ్దాల పాటు అమెరికా బలగాలను (U.S. military forces) మోహారించి ఇపుడు తిరిగి వెనక్కి తీసుకెళ్ళటం వలన, తాలిబన్లు ఆఫ్ఘన్ పై ఎగబడి దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. తద్వారా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై (American president Joe Biden) ప్రపంచ దేశ ప్రజల నుండి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఈ రోజు ఉదయం నుండి అమెరిక వైట్ హౌజ్ ముందు ఆఫ్ఘన్ జాతీయులు (Afghan nationals) వ్యతిరేఖంగా నిరసనలు తెలుపుతున్నారు.
Also Read: Heavy Rains Alert: రానున్న 48 గంటల్లో ఏపీకు అతి భారీ వర్షాల ముప్పు
"బైడెన్ నువ్వు మమ్మల్ని నమ్మించి మోసం చేసువు.. అక్కడ నేలపై పడే ప్రతి రక్తపు బొట్టుకు, ప్రతి చావుకు నువ్వే కారణం" అంటూ నినాదాలతో వైట్ హౌస్ (America White House) హోరెత్తింది. ప్రపంచ దేశాల నుండి విమర్శలు వస్తున్న అమెరికా తన సాయుధ బలగాలను ఆఫ్ఘనిస్థాన్ నుండి తిరిగి రప్పించే ప్రకియను ఇంకా కొనసాగించటం గమనార్హం.
తాలిబన్ల పాలన దారుణంగా ఉంటుందని, ప్రజలను చంపేస్తారు, మహిళలకు ఎలాంటి రక్షణ ఉండదని నిరసనకారులు విలపిస్తున్నారు. "మా దేశం మళ్లి 20 ఏళ్ల నాటికీ వెనుకబాటుకు గురైంది.. తాలిబన్ల పాలనలో ఒసామా బిన్ లాడెన్ (Osama bin laden), ముల్లా ఒమర్ (Mullah Omar) లాంటి క్రూరమైన తీవ్రవాదులు కొన్ని వేలమందిలో తయారువుతారు... మాకు మా దేశ ప్రజలకు శాంతి స్వేచ్చ కావాలి" అని ఆ దేశా మాజీ జర్నలిస్ట్ హమ్‌దర్ఫ్ గఫూరి స్పంచించాడు. తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. పాకిస్థాన్‌తో (Pakistan) చేతులు కలిపి ప్రపంచవ్యాప్తంగా దాడులు జరిపి అల్లకల్లోలాన్ని శృష్టిస్తారని ఆఫ్ఘన్ జాతీయులు ఆందోళన వ్యక్తం చేసారు.
Also Read: India Corona Update: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా మహమ్మారి ఉధృతి
ఆఫ్ఘనిస్థాన్ ప్రధాని అష్రఫ్ ఘనీ (Ashraf Ghani) తాలిబన్లను ప్రతిఘతించకుండానే రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవటం, ఆదివారం ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ను (Kabul) కూడా తాలిబన్లు ఆక్రమించటం అక్కడి దేశ ప్రజలను నిద్రలేకుండా చేస్తుంది. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల (Taliban)వశం అవ్వగానే అక్కడి దేశ ప్రజలు దేశం వదిలి వెళ్లిపోవడానికి సరిహద్దుల దగ్గరికి భారీ చేరుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook