చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం అలీబాబా సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ జాక్‌ మా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం(సెప్టెంబరు 10) తాను రిటైర్‌మెంట్‌ తీసుకోనున్నట్లు ప్రకటించారు. సోమవారం జాక్ మా 54 వ పుట్టినరోజు. అదే రోజు పదవీ విరమణ చేస్తున్నట్లు చెప్పారు. పదవీ విరమణ తర్వాత ఫిలాంత్రఫీ కోసం సమయం కేటాయిస్తానని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లిష్‌ టీచర్ అయిన జాక్‌ మా 1999లో చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం అలీబాబాను స్థాపించారు. తక్కువ కాలంలో ఈ సంస్థ వేగంగా అభివృద్ధి చెంది బిలియన్ డాలర్ల కంపెనీగా మారింది. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసే నాటికి కంపెనీ విలువ 420.8 బిలియన్‌ డాలర్లు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జాక్‌ మా సంపద విలువ ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం 38.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది.


న్యూయార్కు టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాక్‌మా మాట్లాడుతూ.. కంపెనీ బాధ్యతల నుంచి సోమవారం తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఇది ముగింపు కాదని.. మరో శకానికి ప్రారంభం అని తెలిపారు. ఇకపై ఫిలాంత్రఫీపై దృష్టిపెడతానని జాక్‌ మా చెప్పారు.