Amazon Black Friday Strike: పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే. ఇప్పుడీ డిమాండ్ ప్రపంచ ప్రసిద్ధ ఈ కామర్స్ వేదికను వెంటాడుతోంది. ప్రపంచ బిలియనీర్ జెఫ్ బెజోస్‌కు నవంబర్ 26న పెద్ద సవాళే ఎదురుకానుంది. ఈ సవాలు బెజోస్‌కు ఏ మేరకు ఇబ్బంది పెట్టనుంది మరి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలో అతిపెద్ద ఈ కామర్స్ వేదిక అమెజాన్(Amazon). ప్రపంచ బిలియనీర్ కూడా అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్. ఇప్పుడీ  సంస్థకు పనికి తగ్గ వేతనం డిమాండ్ వేధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ఉద్యోగులు ఉద్యమించనున్నారు. అమెజాన్ సంస్థలో పనిగంటలు ఎక్కువగా ఉన్నాయనేది ఉద్యోగుల ఆవేదన, అసంతృప్తిగా ఉంది. పనిగంటలు ఎక్కువగా ఉన్నా..అందుకు తగ్గ వేతనం చెల్లించేలేదని ప్రదాన విమర్శ. ఉద్యోగులతో ఎక్కువ పని చేయించుకుంటూ..తక్కువ వేతనం చెల్లిస్తోందని ఆ సంస్థ ఉద్యోగుల నిరసనను ప్రపంచానికి చెప్పేందుకు మేక్ అమెజాన్ పే.కామ్(Amazon pay.com)పేరుతో ఏకంగా వెబ్‌సైట్ ఆవిష్కరించారు. తమ డిమాండా్లను ఆ వెబ్‌సైట్‌లో ఉంచారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ధర్నాకు సిద్ధమయ్యారు. జెఫ్ బెజోస్‌కు(Jeff Bezos) షాక్ ఇచ్చేందుకు నిర్ణయించారు. ప్రపంచంలో 20 దేశాలకు చెందిన అమెజాన్ ఉద్యోగులు డిమాండ్ల సాధనకై..ఉద్యమించనున్నారు. నవంబర్ 26వ తేదీన బ్లాక్ ఫ్రైడే సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ సమ్మెలో 20 లేదా అంతకంటే ఎక్కువ దేశాల అమెజాన్ ఉద్యోగులు, యూనియన్ సంఘాలు గ్రీన్‌పీస్, ఆక్స్‌ఫామ్ వంటి సంస్థలు మద్దతు పలుకుతున్నాయి.


అమెజాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా పలు నివేదికలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. అమెజాన్ సంస్థపై విమర్శలు ట్రోల్ అవుతున్నాయి. అమెజాన్ సంస్థ పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటోందని..ప్రోపబ్లికా నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం..2006 నుంచి 2018 మధ్యకాలంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఏ విధమైన పన్నులు చెల్లించలేదు. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో అమెజాన్ ఉద్యోగుల బ్లాక్ ప్రైడే సమ్మె(Black Friday Strike)..సంస్థకు అన్ని విధాలుగా దెబ్బేననేది మార్కెట్ విశ్లేషకుల అంచనా. ఈ సమ్మె ప్రభావం సంస్థ షేర్లపై పడే ప్రభావం లేకపోలేదంటున్నారు. మరోవైపు సంస్థ ప్రతిష్ఠకు భంగమనేది సర్వత్రా విన్పిస్తున్న అభిప్రాయంగా ఎందుకంటే సంస్థ ఉద్యోగులు కరోనా మహమ్మారి కాలంలో రేయింబవళ్లు పనిచేయడం వల్లనే 2 వందల బిలియన్ డాలర్ల ధనవంతుల జాబితాలో జెఫ్ బెజోస్ చేరారని అటు ఉద్యోగులు, ఇటు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. 


Also read: రష్యాలో కరోనా కల్లోలం...రికార్డు స్థాయిలో మరణాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook