H-1B Visa Rules: హెచ్1 బి వీసా అనేది అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం చేసేవారికి ఇచ్చే కీలకమైన డాక్యుమెంట్. అగ్రరాజ్యంలో ఉద్యోగ నిమిత్తం స్థిరపడాలనుకునేవారికి ఎప్పుడూ ఈ వీసా విషయంలోనే టెన్షన్ ఉంటుంది. ఇప్పుడీ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో ఇండియా నుంచి అమెరికాలో స్థిరపడేవారికి ఈ వీసా ఉండాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడీ వీసా విషయంలో అగ్రరాజ్యం గుడ్‌న్యూస్ అందిస్తోంది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ హెచ్ 1బి వీసా ప్రోగ్రాంలో కీలకమైన మార్పు చేసింది. ఈ కొత్త మార్పులు, నిబంధనలు జనవరి 17 నుంచి అమల్లోకి రానున్నాయి. హెచ్1 బి మోడర్నైజేషన్ ఫైనల్ రూల్ ప్రకారం నిపుణులైన విదేశీ సిబ్బంది నియామకం ఇక మరింత సులభం కానుంది. అమెరికాలోని ఐటీ, ఫైనాన్స్, ఫార్మా కంపెనీల అవసరాలు తీర్చేందుకు ఈ కొత్త మార్పులు అనివార్యమౌతున్నాయి. వీసా ప్రక్రియను ఎంత సులభతరం చేస్తే అంత ఈజీగా వీసా పొందే అవకాశముంటుంది. ఈ వీసాతోనే అమెరికా కంపెనీలు విదేశీ సిబ్బందిని నియమించుకుంటున్నాయి. విదేశీ సిబ్బందిని అక్కడి కంపెనీలు స్పాన్సర్ చేస్తుంటాయి. ఇప్పుడు కొత్తగా చేపట్టిన మార్పులు, తీసుకొస్తున్న నిబంధనలతో హెచ్1బీ వీసా కోసం అప్లై చేసే కంపెనీలు లేదా ఉద్యోగులు ఫామ్ ఐ 129 వినియోగించాల్సి ఉంటుంది. కొత్త మార్పులు, నిబంధనలు జనవరి 17 నుంచి అమల్లోకి వస్తాయి. 


హెచ్1 బీ వీసా ప్రక్రియలో కీలక మార్పులివే


వీసా కోసం అప్లై చేసేటప్పుడు విదేశీ సిబ్బంది తాను చేసే ఉద్యోగానికి కావల్సిన డిగ్రీని పొంది ఉండాలి. నాన్ ప్రోఫిట్ ప్రభుత్వ రీసెర్చ్ సంస్థలకు హెచ్ 1బీ వీసాల వార్షిక పరిమితి ఉండదు. మినహాయింపు ఉంటుంది. ఎలిజిబిలిటీ కూడా మారవచ్చు. వీసా ప్రక్రియలో మార్పుతో ఎక్కువగా ప్రయోజనం పొందేది భారతీయులే కావడం విశేషం. ఎఫ్ 1 వీసాతో చదువు నిమిత్తం వచ్చేవారు వీసా కోసం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే హెచ్1 బీ వీసా ఉండి ఇంకోసారి అప్లై చేస్తుంచే అమెరికా ప్రభుత్వం వెంటనే ఆమోదిస్తుంది. 


అమెరికాలో ప్రతి ఏటా 65 వేల హెచ్1 బీ వీసాలు జారీ అవుతున్నాయి. ఇవి కాకుండా ఏటా 20 వేల వీసాలు అమెరికాలోని విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్ధులకు ఇస్తున్నారు. ఇప్పటికే హెచ్1 బీ వీసాల వల్ల ఆ దేశంలో ఉద్యోగాలు కోల్పోతున్నారంటూ విమర్శలు చెలరేగుతున్నాయి. కానీ అమెరికా కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం వీసా ప్రక్రియకు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆ దేశంలోని కంపెనీలకు ఆర్దికంగా ప్రయోజనం చేకూర్చే నిర్ణయమిది.


Also read: Fastag Check: సంక్రాంతికి ఊరెళ్తున్నారా, ఫాస్టాగ్ ఓసారి చెక్ చేసుకోండి లేకపోతే ఇబ్బందులే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.