Ukraine Issue: రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇండియాను మరోసారి హెచ్చరించింది అమెరికా. రష్యాతో సంబంధాలు పెట్టుకోవద్దని..అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సూచించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా, బ్రిటన్ సహా పాశ్చాత్య దేశాల వైఖరి ఒకలా ఉంటే రష్యాకు పొరుగుదేశం ఇండియా వైఖరి మరోలా ఉంది. ఉక్రెయిన్ యుద్ధం కాకపోయినా రష్యా ఎప్పుడూ ఇండియాకు మిత్రదేశంగానే ఉంది. నేతలు, ప్రభుత్వాలు మారినా ఇండియా-రష్యా స్నేహబంధం ఎప్పుడూ చెదరలేదు. అదే ఇప్పుడు కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపద్యంలో వివిధ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అయినా ఇండియా మాత్రం అలా చేయలేదు. తనదైన శైలిలో కొనసాగుతోంది. తటస్థ వైఖరి కొనసాగిస్తోంది. 


ఇది ఊహించని అమెరికా ఇప్పుడు ఇండియాకు వార్నింగ్ ఇస్తోంది. రష్యాతో బంధం వద్దని చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం అనంతరం..ఇండియా తీసుకొచ్చిన కొన్ని ప్రతిస్పందనలపై అమెరికా నిరాశకు లోనైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ అత్యున్నత ఆర్ధిక సలహాదారుడు బ్రియన్ డీస్ తెలిపారు. ఇండియా నిర్ణయాల పట్ల నిరాశకు గురైనట్టు చెప్పారు. రష్యాతో వ్యూహాత్మక కూటమిని ఇండియా దీర్ఘకాలం కలిగి ఉంటుందనేది అమెరికా వాదన. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు రష్యాపై ఆర్ధిక ఆంక్షలు విధించినా..ఇండియా మాత్రం నిరంతరంగా చమురు దిగుమతి చేసుకుంటోందని బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. ఇండియా వైఖరి వల్ల..అమెరికాతో సంబంధాలు దెబ్బతింటాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని సవాలు చేయాలంటే అమెరికాకు ఇండియా ఒక్కటే భాగస్వామ్య దేశం. 


Also read: Sri Lanka Emergency: శ్రీలంకలో ఎమర్జెన్సీని ఎత్తివేసిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook