Boston US Doctor Case: అమెరికాలోని బోస్టన్‌లో భారత సంతతికి చెందిన సుదీప్త మోహంతి ప్రముఖ వైద్యుడుగా ఉన్నారు. 27 మే 2022లో హోనలూలు నుంచి బోస్టన్‌కు విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో విమానంలో సుదీప్త అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా అందరూ చూస్తుండగానే హస్త ప్రయోగం కానిచ్చాడు. అతడి సీటుకు చేరువలో పద్నాలుగేళ్ల బాలిక కూడా ఉంది. ఈ విషయాన్ని బాలిక విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. మొహంతి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. ఇప్పుడు దుప్పటి కప్పుకున్నాడని వాపోయింది. సిబ్బంది చూసి వెళ్లాక మరోసారి మొహంతి మళ్లీ హస్త ప్రయోగానికి పాల్పడ్డాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వ్యవహారం అప్పట్లో దుమారం రేపగా విమానయాన సిబ్బంది బోస్టన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తాజాగా విచారణలో సుదీప్త మొహంతి సంచలన విషయాలు చెప్పాడు. అలా చేసినందుకు తనకు ఎలాంటి మోహమాటం, సిగ్గు లేదని విచారణలో మొహంతి చెప్పాడంట. అంతకుముందు విచారణలో అలా చేసినట్టు కూడా తనకు తెలియదని బుకాయించాడు.


'నా ముందు కాబోయే భార్య కూర్చుంది. ఆ సమయంలో ఎలా ఉంటదో మీరు అర్థం చేసుకోవాలి. అలా ప్రవర్తించినందుకు నేనేమీ బాధపడడం లేదు. నాకు నామోషీ లేదు. నేను బాధ్యతాయుతమైన ఒక వైద్యుడిని. నాపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు' అని సుదీప్త మొహంతి విచారణలో తెలిపాడు. కాగా, ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. అతడి చేసిన ప్రవర్తన తప్పు అని రుజువైతే మాత్రమే అక్కడి చట్టం ప్రకారం సుదీప్త మొహంతిపై 90 రోజుల జైలు శిక్ష, 5 వేల డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.


మొదటి నుంచి ఇది తప్పుడు ఆరోపణలు అని సుదీప్త మొహంతి తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. సుదీప్త కూడా రోజుకో మాట చెబుతూ కేసును కాలయాపన చేస్తున్నాడు. మొదటి విచారణలో తనకు ఏం జరిగిందో గుర్తు లేదని చెప్పాడు. ఇప్పుడుఅలా చేసినందుకు తప్పుగా భావించడం లేదని పేర్కొన్నాడు. మళ్లీ తప్పుడు ఆరోపణలు అంటున్నాడు. దీంతో బోస్టన్‌ కోర్టు ఈ కేసు విచారణను మరోసారి వాయిదా వేసింది. వచ్చే విచారణలో వాస్తవాలు గ్రహించి వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు చెప్పారని అక్కడి వార్తా సంస్థలు తెలిపాయి.

Also Read: Drunker Ambulance Call: తాగుబోతు అతి తెలివి.. నడవలేక అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి పిలుపు

Also Read: Drunker Ambulance Call: తాగుబోతు అతి తెలివి.. నడవలేక అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి పిలుపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter