ఆధునిక నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చనిపోయారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆయన మరణించిన వార్తను ఉత్తర కొరియా ప్రపంచానికి తెలియనివ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. జపాన్, హాంగ్ కాంగ్ లాంటి దేశాల మీడియా కూడా ఇదే విధంగా ప్రచారం చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలోనూ కిమ్ జోంగ్ మరణ వార్తపై విపరీతంగా మేసేజ్‌లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ  కిమ్ జోంగ్ ఉన్ చనిపోయారా..? జీవించే ఉన్నారా..? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి..? అనే విషయాలపై  ఉత్తర కొరియా పొరుగు దేశం దక్షిణ కొరియా క్లారిటీ ఇచ్చింది. కిమ్ జోంగ్ ఉన్ చనిపోయారన్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. ఆయన క్షేమంగానే ఉన్నారని దక్షిణ కొరియా తొలిసారిగా మీడియాకు వివరించింది.


దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జో ఇన్ విదేశాంగ సలహాదారు మూన్ చుంగ్ ఇన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నారని తెలిపారు. అంతే కాదు ఆయన ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు. ఏప్రిల్ 13 నుంచి వోన్సాన్ ప్రాంతంలో ఆయన ఉంటున్నారని తెలిపారు. కిమ్ చనిపోయారన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. 


ఈ నెల 15న కిమ్ తాత జయంతి ఉత్సవాలు ఉత్తర  కొరియాలో ఘనంగా జరిగాయి. ఐతే ఈ ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ హాజరు కాలేదు. దీంతో అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై వదంతులు ప్రారంభమయ్యాయి.  కిమ్.. చివరిసారిగా ఏప్రిల్ 11న జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. ఓ శస్త్రచికిత్స కారణంగా ఆరోగ్యపరిస్థితి బాగా లేదని.. ప్రస్తుతం ఆయన రోజులు లెక్కబెడుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. 


మరోవైపు ఉత్తరకొరియా, దక్షిణ కొరియా మీడియాల్లోనూ ఇదే రకమైన వార్తలు  వెలువడ్డాయి. ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి. చైన్ స్మోకింగ్, స్థూలకాయం, పని ఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తాయని తెలిపాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..