CM Jagan tour: నవ్యాంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం జగన్‌ దావోస్ టూర్‌ కొనసాగుతోంది. ఏపీ పెవిలియన్‌లో ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూల అంశాలను వివరించారు. సింగిల్ విండోలో ఇస్తున్న అనుమతుల గురించి తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పలు ఎంవోయూలపై సంతకాలు జరిగాయి. తాజాగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో పరిశ్రమల ఎదుగుదలకు అపార అవకాశాలను ఉన్నాయని వివరించారు. పారిశ్రామికవేత్తలతోపాటు యంగ్ ఎంట్రప్యూనర్లతో ముచ్చటించారు. స్టార్టప్‌లతో కెరీర్‌ను ప్రారంభించి వాటిని యూనికార్న్‌ స్థాయికి తీసుకెళ్లిన పలువురితో సమావేశమయ్యారు. మీషో వ్యవవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రేయ, బైజూస్ వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్ పాలసీ సుష్మిత్ సర్కార్, కాయిన్ స్విచ్‌ క్యూబర్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో ఆశిష్  సింఘాల్‌తోపాటు ఇతర పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ ప్రత్యేకంగా మంతనాలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.


యూనికార్న్ స్టార్టప్స్ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దుతున్నామన్నారు సీఎం జగన్. విశాఖ కేంద్రంగా స్టార్టప్స్ కార్యకలాపాలు సాగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విధాన పరంగా తీసుకోవాల్సిన అంశాలపై పారిశ్రామికవేత్తలతో చర్చించామన్నారు. ఏపీలో విద్యా రంగానికి తోడ్పాటు అందిస్తామని బైజూస్‌ వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్‌ పాలసీ సుష్మిత్ సర్కార్ తెలిపారు. ఏపీలో విద్యకు సంబంధించిన పరిశోధక, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బైజూస్ పాఠ్య ప్రణాళికలను ఏపీ విద్యార్థులకు అందేలా చూస్తామన్నారు. 


ఏపీలో సమగ్ర భూసర్వే, రికార్డుల భద్రతపై కాయిన్‌స్విచ్ క్యూబర్ కంపెనీ వ్యవస్థాపకుడు, గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్‌ సింఘాలతో మంతనాలు జరిపారు. సమగ్ర భూసర్వే రికార్డుల భద్ర పర్చడంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టితో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.  ఏపీలో పర్యాటక అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారు. 
 


 


Also read:Vishwaroop Comments: కోనసీమ అల్లర్ల వెనుక ఆ పార్టీల హస్తం..మంత్రి విశ్వరూప్‌ హాట్ కామెంట్స్..!


Also read:Video: ఈ చిన్నారి సంకల్పానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఒంటికాలితో గెంతుతూ స్కూల్‌కు...   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి