Asani Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను రానున్న 2-3 రోజుల్లో ప్రభావం చూపనుంది. ఈ తుపానుకు అసనీగా నామకరణం చేశారు. ఎవరు చేశారు, అసనీ అంటే అర్ధమేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారనుంది. ఈ తుపాను కారణంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. తీరం దాటకుండానే రానున్న 2-3 రోజుల్లో తుపాను ప్రభావం కన్పించనుంది. ఈ తుపానుకు అసనీగా నామకరణం చేశారు. శ్రీలంక దేశం ఈ పేరు పెట్టింది. అసనీ అంటే సింహళ ప్రాంతంలో ప్రతీకారం లేదా శిక్షించడం అని అర్ధం లేదా తీవ్రమైన ప్రకోపం అని అర్ధం. 


2020లో ఐఎండీ 169 తుపాను పేర్లను ప్రచురించింది. ప్రపంచ వాతావరణ సంస్థకు చెందిన 13 సభ్యదేశాలతో చర్చల అనంతరం వెలువరించిన ట్రోపికల్ తుపాన్ల పేర్లివి. ప్రతి దేశం 13 పేర్లను సూచించాల్సి ఉంటుంది. ఇందులో బంగ్లాదేశ్, ఇరాన్, ఇండియా, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్, యూఏఈ, యెమెన్, మాల్దీవ్స్, కతార్, సౌదీ అరేబియా దేశాలున్నాయి. 


తుపాన్లకు పేర్లు ఎలా పెడతారు


తుపాన్లకు పేర్లు పెట్టడమనేది చాలా ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. అంకెలు, సాంకేతిక పదాల కంటే పేర్లుంటే సులభంగా గుర్తుంచుకోవచ్చనే ఉద్దేశ్యంతో తుపాన్లకు పేర్లు పెట్టడం ప్రారంభమైంది. రెండు తుపాన్ల మద్య తేడా ఏముందో చెప్పేందుకు ఇది దోహదపడుతుంది. డబ్ల్యూఎంవో ఈ పేర్లను నిర్వహిస్తుంది. ఒక్కోసారి తుపాన్లు వారం కంటే ఎక్కువ రోజులుండటం లేదా ఒకే సమయంలో ఎక్కువ తుపాన్లు రావడం జరుగుతుంటుంది. ఆ సందర్భాల్లో తుపాన్లకు పేర్లుండటం వల్ల కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. 


సాధారణంగా తుపాను పేర్లనేవి ప్రాంతీయంగా ఉంటాయి. అట్లాంటిక్, హిందూ మహా సముద్రం, దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని ట్రోపికల్ తుపాన్లకు పేర్లు ఆల్భాబెటికల్ ఆర్డర్‌లో ఉంటాయి. స్త్రీ, పురుష పేర్లు ఒకదాని తరువాత మరొకటిగా వస్తాయి. ఉత్తర హిందూ మహా సముద్రం పరిధిలోని దేశాలు 2000 సంవత్సరంలో కొత్త పద్దతి ప్రవేశపెట్టారు. దేశాలవారీగా ఆల్భాబెటికల్‌గా వస్తాయి. ఆయా దేశాలు ఈ పేర్లను సూచిస్తాయి. 


సాధ్యమైనంతవరకూ చిన్న పదాలే ఉండాలి. 1953 నుంచి అట్లాంటిక్ ట్రోపికల్ తుపాన్ల పేర్లు నేషనల్ హరికేన్ సెంటర్ జారీ చేసిన జాబితా నుంచి వచ్చినవే. 


Also read: The Rock Diamond Auction: వేలంలోకి రానున్న అతి పెద్ద వజ్రం ఇదే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook