Ashes Jewellery: ఒంటికి ధరించే ఆభరణాలు రకరకాలుగా ఉంటాయి. బంగారంతో, వెండితో, వజ్రవైఢూర్యాలతో లేదా బీట్స్, ప్లాటినంతో తయారవుతుంటాయి. కానీ అస్థికలతో ఆభరణాలంటే ఆశ్చర్యంగా ఉందా..ఇది నిజమే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్కెట్‌లో ఎప్పటికప్పుడు వివిధ రకాల ఆభరణాలు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారే కొద్దీ ఆభరణాల తయారీ విధానం మారుతుంటుంది. ఎంత మారినా బీట్స్, స్టోన్స్, బంగారం, వెండి, ప్లాటినం లేదా వజ్ర వైఢూర్యాలు. ఇవే ఉపయోగిస్తుంటారు ఆభరణాల తయారీలో. కానీ అక్కడ మాత్రం అస్థికలతో ఆభరణాలు తయారు చేస్తున్నారంటే వినడానికే విడ్డూరంగా ఉందా. కేవలం తయారు చేయడమే కాదు ఆ ఆభరణాలకు పూర్తి డిమాండ్ కూడా ఉంది. అస్థికలతో ఆభరణాలేంటని అవాక్కవ్వాల్సిందే కానీ నిజం ఇది. అసలు అస్థికలతో ఆభరణాలు ఎందుకు తయారు చేస్తున్నారంటే..రీజన్ కూడా లాజికల్‌గానే ఉందంటున్నారు.


ఇది కూడా ఎక్కడో కాదు. అగ్రరాజ్యం అమెరికాలో(America)మరి. న్యూయార్క్‌లోని మార్గరెట్ క్రాస్ అనే సంస్థ ఈ అస్థికల ఆభరణాల్ని(Cremation Ashes Jewellery) తయారు చేస్తోంది. అస్థికల అవశేషాలతో ఏకంగా రింగ్, బ్రాస్‌లెట్, ఛైన్స్ అన్నీ తయారు చేసేస్తోంది. మరణించిన వ్యక్తుల పళ్లు, జుట్టు, గోళ్లు, అస్థికలతో ఇవి తయారవుతుంటాయి. ఇలా ఎందుకంటే అదొక నమ్మకమంటున్నారు.ఆత్మీయులు, కుటుంబసభ్యులు దూరమైనప్పుడు వారికి గుర్తుగా ఏదో ఒక వస్తువును ఉంచుకుంటారు సాధారణంగా. ఈ అలవాటులో భాగంగానే ఇప్పుడీ అస్థికల ఆభరణాలు. చనిపోయినవారి అస్థికలతో, శరీర భాగాలతో ఆభరణాలు తయారు చేసి ధరిస్తే..వారంతా తమతోనే ఉంటారనేది అమెరికాలో ఓ నమ్మకం. మరణించినవారి జుట్టునైతే ఉంగరాల్లో భద్రపరుస్తారు. 


ఈ నమ్మకాన్ని వ్యతిరేకించేవారు ఉన్నా సరే..లవ్ అండ్ లాస్ అనే ఈ కొత్త ఆలోచన ప్రజలకు చేరువవుతోంది. క్రేజ్ పెరుగుతోంది. అన్నట్టు ఈ అస్థికల ఆభరణాల ధర కూడా ఎక్కువే. అస్థికలే కదా చవగ్గా ఉంటాయనుకోవద్దు. ఎందుకంటే ఈ అభరణాల్ని తయారు చేసేందుకు చాలా సమయం పడుతుందట. 


Also read: Omicron deaths: 2022 ఏప్రిల్​ నాటికి యూకేలో ఒమిక్రాన్ వల్ల 75 వేల మరణాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook