ఆ దేశంలో.. ఉద్యోగులకు విశ్రాంతి హక్కు..!
తాజాగా దక్షిణ కొరియా పనిగంటలను తగ్గించి ఉద్యోగికి విశ్రాంతిని కల్పించి.. ఆరోగ్యంగా ఉంచి ఆయుష్షును పెంచాలని కొన్ని చర్యలను చేపట్టింది. ఒకప్పుడు ఈ దేశం ఆర్ధిక వృద్ధి కోసం అదనపు పనిగంటలు ప్రవేశపెట్టారు.
సియోల్: సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వచ్చాక కార్పొరేట్ సంప్రదాయాలు పెరిగాయి. పనిగంటల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఇదివరకు గవర్నమెంట్ రూల్స్ మాదిరి రోజుకు 8 గంటలు పనిచేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనిషి యొక్క సగటు రోజువారీ పనిగంటలు పెరిగాయి. 8 గంటలు పోయి.. 9.. 9 గంటలు పోయి.. 10.. 10 గంటలు పోయి.. 11 ఇలా పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గటం లేదు.
తాజాగా దక్షిణ కొరియా పనిగంటలను తగ్గించి ఉద్యోగికి విశ్రాంతిని కల్పించి.. ఆరోగ్యంగా ఉంచి ఆయుష్షును పెంచాలని కొన్ని చర్యలను చేపట్టింది. ఒకప్పుడు ఈ దేశం ఆర్ధిక వృద్ధి కోసం అదనపు పనిగంటలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు జననాల రేటు తక్కువ కావడం, పలు సామాజిక సమస్యల కారణంగా దిద్దుబాటు చర్యలను చేపట్టింది.
దక్షిణ కొరియా ప్రజలు ఏడాదికి 2,069 గంటలు పనిచేస్తున్నారు. మెక్సికో తరువాత అధిక పనిగంటలు ఉన్న దేశం ఇదే. వారంలో పనిగంటలను 68 నుంచి 52కు తగ్గించాలని, వారాంతపు రోజుల్లో చేసే పనికి 50 శాతం అదనంగా చెల్లింపులు జరపాలని అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరింది. అయితే కొందరు సభ్యులు, కార్మిక సంఘాలు వారాంతాల్లో చేసే పనికి 100 శాతం అదనపు చెల్లింపులు జరపాలని వాదిస్తున్నారు. కొరియా ట్రేడ్ యూనియన్స్ కాన్ఫెడరేషన్ కూడా వారాంతపు పనిపై చెల్లింపులు రెట్టింపు చేయడం సబబేనని.. పనిచేసేవారికి తగినస్థాయిలో చెల్లింపులు జరుగుతాయని పేర్కొనింది. ఒకవేళ కార్మిక చట్టాన్ని సమీక్షించడంలో విఫలమైతే ఈ సమావేశాల్లో పార్లమెంట్ లో దానిని పరిశీలించలేరు. తిరిగి ఫిబ్రవరిలో జరిగే సమావేశాలలో మాత్రమే దానిని పరిశిలించాల్సి ఉంటుంది.