మరికొన్ని రోజుల్లో కోవిడ్19 వ్యాక్సిన్ అందిస్తుందని బ్రిటన్ పౌరులు భావిస్తోన్న ఆక్స్‌ఫర్డ్ టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిపివేశారు. తుది దశ ప్రయోగాలలో ఉన్న ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. పలు దేశాలలో ఆక్స్‌ఫర్డ్ టీకాను ప్రయోగిస్తుండగా.. బ్రిటన్‌లో కరోనా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అస్వస్థతకు గురవుతున్నాడని గుర్తించారు. Gold Price: మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను, ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా తెలిపింది. వ్యాక్సిన్‌ భద్రత, ప్రయోగ ప్రామాణికత ఇతరత్రా అంశాలపై త్వరలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని రాయిటర్స్ మీడియా రిపోర్ట్ చేసింది. వాలంటీర్ ఆరోగ్యాన్ని పరీక్షించి, రిపోర్టులు పరిశీలించిన అనంతరం సమీక్ష సమవేశం నిర్వహించి కీలక నిర్ణయం వెల్లడించనున్నారు. Rhea Chakraborty Arrest: అది ఆమె కర్మ.. అంకితా లోఖాండే పోస్ట్!


కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా  (Astra Zeneca Vaccine), ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలు కలిసి పనిచేస్తున్నాయని తెలిసిందే. ఫేజ్ 3 దశలో ఉన్న ట్రయల్స్ త్వరలోనే తిరిగి ప్రారంభిస్తారని వైద్య నిపుణులు ఆశిస్తున్నారు. 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR