ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ ( AstraZeneca-Oxford ) యూనివర్సిటీ వ్యాక్సిన్ ట్రయల్స్ మళ్లీ ప్రారంభమయ్యాయి. వ్యాక్సిన్ తో ప్రమాదం లేదంటూ క్లీన్ చిట్ రావడంతో పరీక్షలు మొదలయ్యాయి. భారత్ లో కూడా పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా ఆశలు పెట్టుకున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ( AstraZeneca vaccine) మళ్లీ పట్టాలకెక్కింది. మూడో దశ ట్రయల్స్ లో యూకే లో ఓ వాలంటీర్ కు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పరీక్షలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అనంతరం వ్యాక్సిన్ తో ప్రమాదం లేదంటూ బ్రిటన్ మెడిసిన్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ట్రయల్స్ మళ్లీ ప్రారంభించింది కంపెనీ. కేవలం యూకేలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించుకోడానికి అనుమతి లభించిందంటూ కంపెనీ ప్రకటించిన నేపధ్యంలో...ఇదే వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ లో పరీక్షల్ని సీరమ్ ఇనిస్టిట్యూట్ కూడా ప్రారంభించే అవకాశాలున్నాయి.


ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి, మార్కెటింగ్ మాత్రం భారత్ కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum Institute ) చేయనుంది. ఈ నేపధ్యంలో భారత్ లో మూడోదశ ప్రయోగాల్ని సీరమ్ ఇనిస్టిట్యూట్ చేపట్టింది. బ్రిటన్ లో సమస్య తలెత్తడంతో ట్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అభ్యంతరం తెలుపడంతో ఇండియాలో కూడా ట్రయల్స్ నిలిపివేశారు. ఇప్పుుడ యూకేలో తిరిగి ప్రారంభించడంతో భారత్ లో కూడా మరోసారి పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.