Pakistan boat capsize: పాకిస్థాన్‌లో ఘోర పడవ ప్రమాదం.. 10 మంది మృతి!
Pakistan boat Accident: పాకిస్థాన్‌లో బోటు బోల్తా పడిన ఘటనలో 10 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది గల్లంతయ్యారు.
Pakistan boat Accident: పాకిస్థాన్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. మదర్సా విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ పడవ నీటిలో మునిగిపోయిన ఘటనలో 10 మంది విద్యార్థులు మృతి చెందగా.. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. గాయపడిన ఏడుగురు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కోహట్ జిల్లాలో జరిగింది. ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు మృతదేహాలను బయటకు తీశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించాలని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ఆపద్ధర్మ సీఎం కేపీకే ఆజంఖాన్ అధికారులకు ఆదేశాలిచ్చారు.
వివరాల్లోకి వెళితే..
విహారయాత్ర భాగంగా..సుమారు 50 మంది విద్యార్థులు తండా సరస్సును చూసేందుకు వెళ్లారు. ఇందులో 25 మంది బోటు ఎక్కి నీటిలో చక్కెర్లు కొట్టారు. ఇంతలో హఠాత్తుగా ఆ పడవ బోల్తా పడింది. విద్యార్థులు వయసు ఏడు మరియు 12 సంవత్సరాల మధ్య ఉంటుందని కోహట్ జిల్లా కమీషనర్ మహమూద్ అస్లాం అన్నారు. గల్లంతైన విద్యార్థుల కోసం పాకిస్థాన్ మిలటరీ డైవర్లు సహాయం చేస్తున్నారు. దక్షిణ పాకిస్థాన్‌లో బస్సు ప్రమాదంలో 40 మందికి పైగా మరణించిన రోజునే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనర్హం.
Also Read: Pakistan bus crash: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం..లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook