China accident: 10 నిమిషాల్లో 49 వాహనాలు ఢీ.. 16 మంది మృత్యువాత..
China accident: 10 నిమిషాల వ్యవధిలో మొత్తం 49 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 66 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంసెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో జరిగింది.
China accident: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని జుచాంగ్-గ్వాంగ్‌జౌ హైవేపై 10 నిమిషాల వ్యవధిలో మొత్తం 49 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 16 మంది దుర్మరణం చెందగా, మరో 66 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన ప్రభుత్వం దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ లో వరుస రోడ్డు ప్రమాదాలు
మెున్న పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-బస్సు ఢీకొన్న ఘటనలో 17 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గురువారం చోటుచేసుకుంది. పెషావర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని సింధు రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. అంతక ముందే రోజు పాకిస్థాన్ లో పడవ మునిగి 10 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మరి కొంత మంది గల్లంతయ్యారు. గత నెల 29న బలూచిస్థాన్‌లో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడి మంటలు చెలరేగి 40 మంది దుర్మణం చెందారు. ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యంగానే పాక్ లో రోడ్డు ప్రమాదం అధికమవుతున్నాయి.
Also Read: Chile wildfire: చిలీలో కార్చిచ్చు కల్లోలం.. 22 మంది మృతి.. వేలాది ఎకరాల అడవి దగ్ధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook