Peru Bus Accident: పెరూలో విషాదం.. లోయలో పడిన బస్సు.. 25 మంది మృతి!
Peru Bus Accident: పెరూలో విషాద ఘటన చోటుచేసుకుంది. బస్సు లోయలో పడిన ఘటనలో 25 మంది దుర్మరణం చెందారు.
Peru Bus Accident: పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర పెరూలో శనివారం తెల్లవారుజామున 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 25 మంది మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. యాక్సిడెంట్ కు గల కారణాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. అయితే ఈ బస్సు పెరూ రాజధాని లిమా నుంచి ఈక్వెడార్ సరిహద్దు సమీపంలోని టుంబేస్ ప్రాంతానికి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఎల్ ఆల్టో మరియు మాన్‌కోరాలోని ఆసుపత్రికి తరలించారు.
"డెవిల్స్ కర్వ్" అని పిలువబడే ప్రమాదకరమైన ప్రాంతంలో క్రాష్ జరిగినట్లు పోలీసులు స్థానిక మీడియాతో చెప్పారు. ప్రయాణికుల్లో కొందరు హైతీకి చెందిన వారని పోలీసులు నిర్ధారించారు. కొందరు బస్సు లోపల ఇరుక్కుపోగా, మరికొందరు బస్సులో నుండి కిందకు పడిపోయారని వారు తెలిపారు.
పెరూలో ట్రాఫిక్ ప్రమాదాలకు అతివేగం మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రధాన కారణాలుగా ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. పెరూలో రోడ్డు ప్రమాదాలు సర్వ సాధారణం. చాలా మంది డ్రైవర్లు ప్రమాదకర రహదారులపై మరియు సరైన శిక్షణ లేకుండానే వాహనాలను నడుపుతున్నారు. దీని కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2021లో అండీస్ పర్వతాలలో ఒక బస్సు హైవే నుండి లోయలో పడిపోవడంతో 29 మంది మరణించారు.
Also Read: Iran earthquake: ఇరాన్‌ను వణికించిన భూకంపం .. ఏడుగురు మృతి.. 440 మందికి గాయాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook