టపాసుల కర్మాగారంలో పేలుడు..47 మంది బలి
టపాసుల కర్మాగారంలో సంభవించిన పేలుడు 47 మందిని పొట్టన పెట్టుకుంది. ఇండోనేషియాలో ఈ దుర్ఘటన సంభవించింది.. వివారాల్లోకి వెళ్లినట్లయితే ఈ రోజు ఉదయం 9 గంటలకు జకార్తా సమీపంలోని తంగెరాంగ్ ప్రాంతంలో ఉన్న ఓ టపాసుల ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనమంతా వ్యాపించాయి. దీంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 47 మంది సజీవ దహనమయ్యారు.. కాగా ఈ ప్రమాదంలో మరో 45 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది . కాగా ఘటన సమయంలో ఫ్యాక్టరీలో 103 మంది సిబ్బంది పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన సమయంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.