Haiti Gas Tanker Explosion: గ్యాస్ ట్యాంకర్ పేలి 50మంది సజీవ దహనం, హైతీలో ఘటన
Haiti Gas Tanker Explosion: గ్యాస్ ట్యాంకర్ పేలి 50 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన కరేబియన్ ద్వీప దేశం హైతీలో చోటుచేసుకుంది.
Haiti Gas Tanker Explosion: హైతీ(Haiti)లో ఘోర ప్రమాదం జరిగింది. కేప్-హైతియన్(Cap-Haitien) నగరంలో మంగళవారం ఉదయం గ్యాస్ ట్యాంకర్ పేలి(Gas Tanker Explosion) 50 మంది సజీవ దహనమయ్యారు. అనేక మంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక డిప్యూటీ మేయర్ పాట్రిక్ అల్మోనోర్(Deputy Mayor Patrick Almonor) వెల్లడించారు.
Also Read: Indonesia Earthquake: ఇండోనేషియాలో 7.6 తీవ్రత భారీ భూకంపం- సునామీ హెచ్చరికలు జారీ
''సంఘటనా స్థలంలో 50-54 మంది సజీవ దహనాన్ని చూశాను'' అని పాట్రిక్ అల్మోనోర్ పేర్కొన్నారు. పేలుడు ధాటికి దాదాపు 20 ఇళ్లు దగ్దమైనట్లు ఆయన చెప్పారు. మృతుల సంఖ్యను ఇప్పుడే చెప్పలేమన్నారు. కాగా ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని ఏరియల్ హెన్రీ(Prime Minister Ariel Henry) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఇళ్లల్లో చిక్కుకుపోయి మరణించినవారితో కలిపి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook