Mexico Shootout: మెక్సికోలో కాల్పుల బీభత్సం... 19 మంది మృతి...
Mexico Shootout: మెక్సికోలో కాల్పుల బీభత్సం చోటు చేసుకుంది. మిచోకాన్ రాష్ట్రంలో జరిగిన ఓ వేడుకలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో 19 మంది మృతి చెందారు.
Mexico Shootout: మెక్సికోలో కాల్పుల బీభత్సం చోటు చేసుకుంది. మిచోకాన్ రాష్ట్రంలో జరిగిన ఓ వేడుకలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో 19 మంది మృతి చెందారు. మృతుల్లో 16 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. కాల్పులు ఎవరు జరిపింది.. ఎందుకు జరిపింది ఇంకా తెలియరాలేదు. సంఘటనా స్థలంలో 19 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించినట్లు మిచోకాన్ రాష్ట్ర అటార్నీ జనరల్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
మిచోకాన్, దాని పొరుగునే ఉండే గ్వానాజువాటో రాష్ట్రాల్లో తరచూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రెండు రాష్ట్రాలు మాఫియా గ్యాంగ్స్‌కి అడ్డాగా మారాయి. ఈ గ్యాంగ్స్ ప్రత్యర్థులపై జరిపే దాడుల్లో తరచూ భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. గత నెలలో మిచోకాన్‌లో ఓ మాఫియా గ్యాంగ్ జరిపిన దాడిలో 17 మంది మృతి చెందారు. ప్రత్యర్థి గ్యాంగ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు జలిస్కో న్యూ జెనరేషన్ కార్టెల్‌కి చెందిన ఓ గ్రూప్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రచారం జరిగింది.
మిచోకాన్ రాష్ట్రం ప్రపంచంలోనే భారీ ఎత్తున అవకాడో ఫ్రూట్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ ఓ ప్లాంట్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అమెరికా వ్యక్తిపై గత నెలలో మాఫియా గ్యాంగ్స్ బెదిరింపులకు పాల్పడ్డాయి. దీంతో మెక్సికో నుంచి అవకాడో దిగుమతులను ఒక వారం పాటు అమెరికా నిలిపివేసింది. గత 16 ఏళ్లలో మెక్సికోలో 3,40,000 హత్యలు జరిగాయి. ఇందులో ఎక్కువ శాతం హత్యలు మాఫియా గ్యాంగ్స్ ప్రత్యర్థి గ్యాంగ్స్‌పై జరిపిన దాడుల్లో జరిగినవే. మెక్సికో అంటేనే హింసకు కేరాఫ్ అనేలా ఈ ఘటనలు ఉన్నాయి.
Also Read: Chaitra Navaratri: చైత్ర నవరాత్రుల ప్రభావం.. ఆ 6 రాశుల వారికి బాగా కలిసొస్తుంది
Also Read: PBKS vs RCB Records: అరుదైన రికార్డు నెలకొల్పిన పంజాబ్.. బెంగళూరు ఖాతాలో చెత్త రికార్డు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook