Afghan Avalanche: ఆఫ్గాన్‌లో భారీ హిమపాతం...12 మంది దుర్మరణం
Afghan Avalanche: భారీ హిమపాతం 12 మంది ప్రాణాలను బలిగొంది. ఈ దుర్ఘటన అఫ్గాన్ ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో జరిగింది.
Afghan Avalanche: ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్‌లోని (eastern Afghanistan) మారుమూల పర్వత ప్రాంతంలో హిమపాతం (Avalanche) సంభవించి 12 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో ఒకరు కనిపించకుండా పోయారని కునార్ ప్రావిన్స్ సమాచార, సాంస్కృతిక విభాగానికి అధిపతి నజీబుల్లా హనీఫ్ తెలిపారు.
హిమపాతం (heavy snowfall) సంభవించిన అనంతరం కొండచరియలు కూడా విరిగిపడ్డాయని హనీఫ్ వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమీప గ్రామాల ప్రజలు సహాయం చేయడానికి వెళ్లారు. సోమవారం ఉదయం మారుమూల ప్రాంతానికి రెస్క్యూ బృందాలను తరలించినట్లు సమాచారం.
గత ఏడాది ఆగస్టులో తాలిబాన్‌లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం చేపట్టారు. అప్పటి నుంచి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌తో సరిహద్దును మూసివేసింది. ఇరు దేశాల సరిహద్దుల్లో 2,670 కి.మీ మేర పాకిస్థాన్ కంచె వేసింది. అయినా సరే అనధికారిక సరిహద్దు క్రాసింగ్‌లు తరచుగా జరుగుతున్నాయి. గత నెలలో బదక్షన్ ప్రావిన్స్‌లో ( Badakhshan province) భారీ హిమపాతం కారణంగా ఐదుగురు మరణించారు. 2015లో దేశవ్యాప్తంగా ఈ హిమపాతాల కారణంగా 250 మందికి పైగా మరణించారు.
Also Read: Mount Everest: వేగంగా కరిగిపోతున్న హిమానీనదం..ప్రమాదంలో ఎవరెస్ట్ శిఖరం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి