అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాసిన ఏ ప్రామిస్డ్ ల్యాండ్ విడుదలకు ముందే సంచలనం రేపుతోంది. కొన్ని సంచలన విషయాలు..మరికొన్ని ఆసక్తికర అంశాలు..ఇంకొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో ఒబామా ప్రామిస్డ్ ల్యాండ్ ట్రెండ్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏ ప్రామిస్డ్ ల్యాండ్ ( #APromisedLand ). అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama ) రాసిన పుస్తకం. ఈ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి  ఒబామా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్లో ఆగ్రహం తెప్పించాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఒబామాపై మండిపడ్డారు. నవంబర్ 17న విడుదల కావల్సిన ఉన్న ఈ పుస్తకం ముందే చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ పుస్తకంలో వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు ఆసక్తికర సంఘటనలు కూడా ఉన్నాయి.


ఇండియాకు సంబంధించిన అంశం ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకంలో ( A Promised Land ) ఉండటంతో మరోసారి వార్తల్లోకెక్కింది. బరాక్ ఒబామా తన బాల్యం ఎలా గడిచిందో పుస్తకంలో వివరించారు. బాల్యమంతా ఇండోనేషియాలో రామాయణ, మహాభారత కధల్ని వింటూ పెరిగానని  రాసుకొచ్చారు. అందుకే భారతదేశం పట్ల తన మనస్సులో ప్రత్యేకస్థానముందన్నారు. ప్రపంచ జనాభాలో ఆరవ వంతు, రెండువేల విభిన్న జాతులు, ఏడు వందలకు పైగా భాషల్ని మాట్లాడే ప్రజల కారణంగా ఇండియాకున్న పరిపూర్ణ పరిమాణంతో భారతదేశం తన మనస్సులో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించిందన్నారు. 


2010లో అధ్యక్ష పర్యటన కంటే ముందు ఇండియాకు  వెళ్లకపోయినా...ఆ దేశం పట్ల నా మదిలో ప్రత్యేక స్థానముంది అని ఏ ప్రామిస్డ్ ల్యాండ్ లో రాశారు. బాల్యంలో కొంతభాగం ఇండోనేషియాలో రామాయణం, మహాభారతం వంటి హిందూ పురాణ కధలు వినడం వల్లనో లేదా..తూర్పు మతాల పట్ల తనకున్న ఆసక్తినో లేదా ఇండియా, పాకిస్తానీ కళాశాల స్నేహితుల వల్లనో...తనకు పప్పు ఖీమా వండటం అలవాటైందని వివరించారు. అందుకే బాలీవుడ్ సినిమాలకు ఆకర్షితుడినయ్యానన్నారు. 


అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా( #BarackObama ).. ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకంలో బాల్యంతో పాటు రాజకీయంగా ఎదిగిన వైనాన్ని రాసుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో అంశాల్ని రాసుకున్నారు. 768 పేజీల ఈ పుస్తకాన్ని పెంగ్విన్  ర్యాండమ్  హౌస్ ...రెండు భాగాలుగా ప్రచురించనుంది. తొలి భాగం ఇవాళే విడుదలైంది.