Covaxin Deal: బ్రెజిల్ దేశంతో కోవాగ్జిన్ డీల్ రద్దు చేసుకున్న భారత్ బయోటెక్
Covaxin Deal: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఒప్పందం రద్దయింది. అవినీతి ఆరోపణలు, రాజకీయ విమర్శల కారణంగా ఒప్పందంపై నీలినీడలు అలముకున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పుడు భారత్ బయోటెక్ కంపెనీ కీలక ప్రకటన చేసింది.
Covaxin Deal: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఒప్పందం రద్దయింది. అవినీతి ఆరోపణలు, రాజకీయ విమర్శల కారణంగా ఒప్పందంపై నీలినీడలు అలముకున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పుడు భారత్ బయోటెక్ కంపెనీ కీలక ప్రకటన చేసింది.
భారత్ బయోటెక్ కంపెనీ(Bharat Biotech) అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ కోసం బ్రెజిల్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే అవినీతి ఆరోపణలు, రాజకీయ విమర్శలు పెద్దఎత్తున చెలరేగడంతో ఈ ఒప్పందంపై నీలినీడలు అలముకున్నాయి. ఒక్కొక్క డోసు 15 డాలర్ల చొప్పున 3 వందల మిలియన్ డాలర్ల విలువ చేసే 20 మిలియన్ డోసుల్ని రప్పించుకునేందుకు బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో..భారత్ బయోటెక్ కంపెనీతో (Covaxin Deal) ఒప్పందం చేసుకున్నారు. కోవాగ్జిన్(Covaxin)ను సన్నిహితులకు చెందిన ఫార్మా సంస్థకు ప్రెసిసా మెడికామెంటోస్ అప్పగించడం ద్వారా 10 కోట్లక డాలర్లు ముడుపులు అందుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంపై ఇంతకాలం మౌనం వహించిన భారత్ బయోటెక్ చివరికి కీలక ప్రకటన చేసింది. బ్రెజిల్ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. అనుమతుల్ని కూడా రద్దు చేసుకుంటున్నట్టు తెలిపింది. అటు బ్రెజిల్(Brazil) కూడా కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ మూడవ దశను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఒప్పందం రద్దయినా..బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థతో భారత్ బయోటెక్ కంపెనీ కలిసి పనిచేస్తుందని తెలుస్తోంది.
Also read: Xi Jinping Tibet visit: టిబెట్‌లో జిన్‌పింగ్ సీక్రెట్ పర్యటన ఎందుకు ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook