Pakistan Bomb blast: పాక్‌లో బాంబు పేలి ఏడుగురు మృతి.. 70 మందికి గాయాలు
పాకిస్తాన్ (Pakistan) దేశంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పేషావర్ ( Peshawar) లో మంగళవారం ఉదయం బాంబు ( Bomb blast ) పేలింది. ఈ పేలుడు ఘటనలో ఏడుగురు చిన్నారులు మరణించగా.. మరో 70 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
Pakistan Bomb blast: ఇస్లామాబాద్: పాకిస్తాన్ (Pakistan) దేశంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పేషావర్ ( Peshawar) లో మంగళవారం ఉదయం బాంబు ( Bomb blast ) పేలింది. ఈ పేలుడు ఘటనలో ఏడుగురు చిన్నారులు మరణించగా.. మరో 70 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్ పెషావర్ నగరంలోని దిర్ కాలనీలోని మదర్సాలో పిల్లలకు ఖురాన్ బోధిస్తున్న సమయంలో మంగళవారం ఉదయం 8.30 గంటలకు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరో 70 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసు సిబ్బంది.. గాయపడిన పిల్లలను సమీపంలోని లేడీ రీడింగ్ హాస్పిటల్కు తరలించారు. మరో 20 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పాక్ వైద్యులు పేర్కొన్నారు. Also read: Weather updates: 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
పేలుడు ఘటనకు సంబంధించి విచారణ చేపట్టనున్నట్లు పేషావర్ పోలీసు అధికారి మన్సూర్ అమన్ తెలిపారు. అయితే.. ఐఈడీతో ప్రార్థనమందిరంలో పేలుడుకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు ఘటనాస్థలానికి సంబంధించిన మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు పేలుడుకు గల ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. Also read: US Election 2020 Record Voting: అమెరికాలో రికార్డు స్థాయిలో ముందస్తు పోలింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe