Brazil cliff collapses on boats: బ్రెజిల్‌లో (Brazil) ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రకృతి సోయగాలను చూసేందుకు వెళ్లిన యాత్రికుల బోటుపై భారీ రాతి ఫలకం (cliff collapses on boats) విరిగిపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఆ యాత్రికుల వారాంతపు విహార యాత్ర కాస్తా..విషాదయాత్రగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే..
బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్‌ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫర్నస్‌ సరస్సు (Lake Furnas). ఇక్కడకు వీకెండ్ లో పర్యాటకులు భారీగా తరలివస్తారు. ఇక్కడి ప్రకృతి సోయగాలను, జలపాతం అందాలను వీక్షించేందుకు యాత్రికులు ఉవ్విళ్లూరుతారు. వారాంతం కావడంతో ఫర్నస్‌ సరస్సుకు టూరిస్టులు భారీగా తరలివెళ్లారు. అంతా బోట్లలో తిరుగుతూ వాటర్ ఫాల్స్ (Waterfalls) సమీపంలోకి వెళ్లారు. అంతే సరస్సులోని మూడు బోట్లపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఏడుగురు ఘటనా స్థలంలోనే మరణించారు. 



Also Read: Pakistan: ముర్రేలో భారీగా కురిసిన మంచు...వాహనాల్లో చిక్కుకొని 22 మంది మృతి!


ఈ ప్రమాదంలో 32 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మరో 20 మంది గల్లంతయ్యారు. వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. దాని వల్లే కొండచరియ విరిగి పడిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో (President Jair Bolsonaro) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం నౌకాదళం, హెలికాఫ్టర్లు, సహాయక దళాలను రంగంలోకి దింపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి