California: ఆగని మంటలు..వేలాది గృహాలు దగ్దం, ముగ్గురి మృతి
అడవులు అంటుకోవడమంటే ఏంటనేది ఆ దేశాలకు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు. ఒక్కసారి అంటుకుంటే రోజుల తరబడి విస్తరిస్తూ ఊర్లను సైతం మింగేస్తుంటుంది. కాలిఫోర్నియాలో ఇప్పుడదే జరుగుతోంది.
అడవులు అంటుకోవడమంటే ఏంటనేది ఆ దేశాలకు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు. ఒక్కసారి అంటుకుంటే రోజుల తరబడి విస్తరిస్తూ ఊర్లను సైతం మింగేస్తుంటుంది. కాలిఫోర్నియా (
California ) లో ఇప్పుడదే జరుగుతోంది.
అమెరియా ( America ) సంయుక్త రాష్ట్రాల్లోని కాలిఫోర్నియాలో రేగిన కార్చిచ్చు ( Fire ) ఇంకా ఆరలేదు. రోజురోజుకూ మరింతగా విస్తరిస్తూ పోతోంది. ఊర్లను సైతం మింగేస్తోంది. వేలాది గృహాలు, ఇతర నిర్మాణాలు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ మంటల్లో ఇప్పటివరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోగా..ఈ ఏడాదిలో అయితే 11 మంది మరణించారు. మంటలకు తోడు బలంగా గాలులు వీస్తుండటంతో మరింతగా విస్తరిస్తున్నాయి.
ఒరోవిల్లే సమీపంలోని కమ్యూనిటీల్లో ఉన్న వేలాదిమందిని ఖాళీ చేయాల్సిందిగా అధికార్లు ఆదేశించారు. అగ్నికీలల తీవ్రత పెరగడంతో భిన్నమైన నారింజరంగులో కన్పించాయి. ప్యారడైజ్ లో రెండేళ్ల క్రితం చరిత్రలో ఎన్నడూ ఎరుగుని ఘోరమైన మంటలతో మొత్తం పట్టణం నాశనమైంది. ఇప్పుడు తిరిగి అదే పరిస్థితి కన్పిస్తుందా అనే ఆందోళన నెలకొంది. 24 గంటల వ్యవధిలో దాదాపు 4 వందల చదరపు మైళ్ల విస్తీర్ణంలో మంటలు విస్తరించాయని నిపుణులు అంచనా వేశారు. కాలిఫోర్నియాలో ఇప్పటివరకూ అంటే ఈ ఏడాదిలో ఏకంగా 2.5 మిలియన్ల ఎకరాలు ( 2.5 million acres ) అగ్నికి ఆహుతయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. Also read: Vaccine Safety Pledge: 9 ఫార్మా కంపెనీల సంతకం...ట్రంప్ ఆశలపై నీళ్లు