Canada Mass Shooting: కెనడాలోని వాంకోవర్ నగరంలో ఓ దుండగుడు కాల్పుల బీభత్సం సృష్టించాడు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత నగరంలో కలియదిరుగుతూ కాల్పులకు పాల్పడ్డాడు. ఇల్లు లేని నిరాశ్రయులే టార్గెట్‌గా అర్ధరాత్రి 12 గం. నుంచి తెల్లవారుజామున 5 గం. వరకు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చునని భావిస్తున్నారు. దుండగుడి కాల్పులపై అలర్ట్ అయిన స్థానిక పోలీసులు.. అతన్ని పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలపాలైన దుండగుడు అక్కడికక్కడే మృతి చెందాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదట వాంకోవర్‌లోని ఓ కేసినో వద్ద అర్ధరాత్రి సమయంలో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత తెల్లవారుజామున 3 గంటలు, 5 గంటలు, 5.45 గంటల సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడ్డాడు. నిరాశ్రయులు ఆశ్రయం పొందే ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌‌తో పాటు స్థానిక బస్టాప్, హైవేపై అతను కాల్పులకు పాల్పడినట్లు చెబుతున్నారు.


దుండగుడి కాల్పులపై సమాచారం అందడంతో నగర ప్రజలకు పోలీసులు సెల్‌ఫోన్ అలర్ట్ పంపించారు. దుండగుడి కాల్పుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. కానీ అప్పటికే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అతన్ని మట్టుబెట్టినట్లు కెనడియన్ మౌంటెడ్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. దుండగుడిని పట్టుకునే క్రమంలో హైవే బైపాస్ సమీపంలో పోలీసులు అతనిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో దుండగుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. అయితే ఆ దుండగుడు ఎవరు.. ఎందుకు కాల్పులకు పాల్పడ్డాడనేది ఇంకా తెలియరాలేదు.
 


Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం... హయత్‌నగర్‌లో అత్యధికంగా 9.8 సెం.మీ వర్షపాతం..  


Also Read: Horoscope Today July 26th : నేటి రాశి ఫలాలు.. ఇవాళ్టితో ఈ రాశి వారికి కష్టాలన్నీ తొలగిపోతాయి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.