carona virus effect, Haj is empty : కరోనా ఎఫెక్ట్: మక్కాకు తగ్గిన భక్తుల రద్దీ
`కరోనా వైరస్` ప్రభావం ప్రపంచంలో అన్నింటిపైనా పడుతోంది. ఇప్పటికే క్రీడలపై ఈ ప్రభావం పడింది. ఇప్పుడు తాజాగా సౌదీ అరేబియాపైనా ప్రభావం చూపిస్తోంది. సౌదీ అరేబియాలోని మక్కాకు చాలా మంది ముస్లిం భక్తులు. . హజ్ ను దర్శించుకోవడానికి వెళ్తుంటారు.
'కరోనా వైరస్' ప్రభావం ప్రపంచంలో అన్నింటిపైనా పడుతోంది. ఇప్పటికే క్రీడలపై ఈ ప్రభావం పడింది. ఇప్పుడు తాజాగా సౌదీ అరేబియాపైనా ప్రభావం చూపిస్తోంది. సౌదీ అరేబియాలోని మక్కాకు చాలా మంది ముస్లిం భక్తులు. . హజ్ ను దర్శించుకోవడానికి వెళ్తుంటారు.
నిజానికి జీవితకాలంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించాలన్నది ముస్లింల ఆకాంక్షగా ఉంటుంది. కానీ కరోనా వైరస్ దెబ్బకు.. ప్రస్తుతం మక్కా మసీదు సందర్శన మూసివేశారు. దీంతో భక్తుల తాకిడి లేక.. మక్కా మసీదు వెలవెలబోతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
[[{"fid":"182846","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
Read Also: హిందూ, ముస్లింలకు వేర్వేరు బిర్యానీ..!! ఎందుకు..?
పశ్చిమాసియాలో కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు 220 మంది చనిపోయారు. దీంతో సౌదీ అరేబియా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇస్లామ్ పవిత్ర స్థలమైన మక్కాకు భక్తులను అనుమతించవద్దని నిర్ణయించింది. నిజానికి మక్కా మసీదు.. ఎప్పటికీ భక్తులతో రద్దీగా ఉంటుంది. కానీ కరోనా ప్రభావం కారణంగా.. సౌదీ ప్రభుత్వం యాత్రికులను అనుమతించకపోవడంతో అంతా ఖాళీగా కనిపిస్తోంది.
ఏడాది పొడవునా మక్కా మసీదును 180 కోట్ల మంది యాత్రికులు సందర్శిస్తారు. ప్రతి రోజూ 5 సార్లు నమాజ్ చేస్తారు. 2014లో ఎబోలా వైరస్ సోకినప్పుడు కూడా మక్కా మసీదుకు యాత్రికులను అనుమతించలేదు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..