Omicron attack on China: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి చైనాను మరోసారి వణికిస్తోంది. రోజురోజుకూ చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు లక్షల్లో నమోదవుతూ..పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. చైనా నగరాలు లాక్‌డౌన్ బారిన పడుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చైనాలోని వుహాన్ నగరంలో 2019 డిసెంబర్‌లో వెలుగుచూసిన కరోనా ప్రపంచమంతా విస్తరించి..రెండేళ్లు దాటినా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. ఇప్పటికే 3-4 వేవ్‌లతో ప్రజానీకం అల్లాడిపోయింది. ఇండియాలో కూడా ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్‌వేవ్ వచ్చింది. ఇప్పుడు ఇండియాలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అదే సమయంలో పొరుగుదేశం, ప్రత్యర్ధి చైనాలో కరోనా మరోసారి కలవరం రేపుతోంది. చైనాలో రోజురోజుకూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 


చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ సరికొత్త రూపంతో దాడి చేస్తూ..ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది. చైనాలో ముందెన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది డ్రాగన్. కనివీని ఎరుగని రీతిలో కేసులు పెరిగిపోతున్నాయి. చైనా దేశం అనుసరిస్తున్న జీరో కొవిడ్ స్ట్రాటజీ ఘోరంగా విఫలమైంది. 13 ప్రధాన నగరాల్లో పూర్తిగా లాక్‌డౌన్ విధించింది చైనా. పలు నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. ఈశాన్య ప్రావిన్స్‌లోని జిలిన్‌లో కొత్తగా 3వేల కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. చాంగ్‌చున్‌ సహా పలు ప్రధాన నగరాల్లో దాదాపు మూడు కోట్ల మంది నివాసితులు హోం క్వారంటైన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు. చైనాలోని అతిపెద్ద నగరం షాంఘైలో పాక్షిక ఆంక్షల సడలింపుతో లాక్‌డౌన్ విధించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో నగరంలో అనేక ఫ్యాక్టరీలు, ప్రజా రవాణాను మూసివేశారు. ప్రపంచంలోని మెజార్టీ దేశాలు సాధారణ స్థితికి చేరుకుంటుంటే..డ్రాగన్ దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుడడంతో చైనా ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


చైనా ప్రపంచంలోనే అతిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా చెలామణి అవుతున్న డ్రాగన్‌‌పై ఆర్థిక మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రపంచంలోని మీగతా దేశాల కంటే చైనా కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికి..విఫలమై ఒమిక్రాన్ వేరియంట్ భారీగా పెరుగుతుడడంతో చైనా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో దక్షిణ కొరియాలో సైతం పెద్దఎత్తున కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 4 లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఫస్ట్‌వేవ్ కేసులతో పోలిస్తే..ఇదే అత్యధికమని సౌత్ కొరియా వైద్యులు చెబుతున్నారు. కరోనా కేసులు మరోసారి పెరగడంతో దక్షిణ కొరియా అతలాకుతలమైంది. 


Also read: Japan Earthquake: జపాన్‌ను వణికించిన భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook