Hafiz Talha Saeed: పాకిస్థాన్, చైనాల మైత్రి బంధం మరోసారి బట్టబయలైంది. అంతర్జాతీయ ఉగ్రవాదులను తయారు చేస్తోన్న పాకిస్థాన్‌కి మద్దతిస్తూ చైనా కూడా తన ఉగ్రవాద బుద్ధిని చూపించుకుంటోంది. పాకిస్థాన్‌కి చెందిన కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ తల్హా సయీద్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్య రాజ్య సమితిలో భారత్, అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. హఫీజ్ తల్హా సయీద్ ఎవరో కాదు.. ముంబై దాడుల మాస్టర్ మైండ్, లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడే ఈ హఫీజ్ తల్హా సయీద్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు రోజుల వ్యవధిలో పాకిస్థాన్‌కి చెందిన ఉగ్రవాదులను చైనా వెనకేసుకురావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మొన్నటికి మొన్న పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మూద్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఇదే భారత్, అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో 1267 అల్ ఖైదా సాంక్షన్స్ కమిటీ ప్రకారమే భారత్, అమెరికా ఈ తీర్మానాలు ప్రవేశపెట్టాయి. అయితే, పాకిస్థాన్‌పై ఎప్పటికప్పుడు ప్రేమ కురిపించే చైనా ఈ తీర్మానాల విషయంలోనూ తన దుర్భుద్దిని ప్రదర్శించింది.


1267 అల్ ఖైదా సాంక్షన్స్ కమిటీ నిబంధనలకు లోబడి పాకిస్థాన్ ఉగ్రవాదులను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని ప్రవేశపెట్టిన తీర్మానాలను చైనా అడ్డుకోవడం ఇదేం మొదటిసారి కాదు. ఇప్పటికే గత నాలుగు నెలల్లో ఐదుసార్లు ఇలాగే పాకిస్థాన్ ఉగ్రవాదులను అంతర్జాతీయ తీవ్రవాదుల జాబితాలో చేర్చాలని చేసిన తీర్మానాలకు చైనా అడ్డం పడిన విషయం తెలిసిందే.


లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థలో హఫీజ్ తల్హా సయీద్ కీలక నేత మాత్రమే కాదు.. సంస్థ కోసం చేపడుతున్న రిక్రూట్మెంట్లలో చురుకుగా వ్యవహరిస్తున్న తీవ్రవాది కూడా. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే కేంద్ర హోంశాఖ హఫీజ్ తల్హా సయీద్‌పై ఒక నోటిఫికేషన్ జారీచేసింది. 


తీవ్రవాదుల నియామకాలు, నిధుల సేకరణ, ఉగ్రవాద దాడులకు వ్యూహరచన, దాడులకు పాల్పడటం వంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడటంలో లష్కరే తొయిబాలోనే చురుకైన నేతగా హఫీజ్ తల్హా సయీద్‌కి పేరుంది. ఈ కారణంగానే అగ్రరాజ్యమైన అమెరికా కూడా భారత్‌తో ఏకీభవిస్తూ హఫీజ్ తల్హా సయీద్‌పై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమై అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణించి తీర్మానం చేసింది. చైనా కూడా ప్రతీ విషయంలో పాకిస్థాన్ కి ( Pakistan ) మద్దతు ఇచ్చినట్టుగానే ఆ దేశం గడ్డపై ఉండి ప్రపంచ దేశాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్న కరడు గట్టిన తీవ్రవాదులను సైతం వెనకేసుకొస్తోంది.


Also Read : Russia vs Ukraine War: రష్యా vs ఉక్రెయిన్ వార్.. భారతీయులకు హెచ్చరికలు


Also Read : RussianPlane Crash : 9 అంతస్తుల అపార్ట్మెంట్లోకి దూసుకొచ్చిన రష్యన్ ఫైటర్ జెట్.. భారీగా ప్రాణనష్టం!


Also Read : China Covid-19: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... లాక్‌డౌన్‌ విధించిన సర్కార్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి