CPEC: భారత సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు..చైనా సైనికుల మోహరింపు దేనికీ..?
CPEC: భారత సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కనిపిస్తున్నాయా..? సరిహద్దు వెంట చైనా సైనికుల మోహరింపు దేనికీ..? అంతర్జాతీయ సమాజం ఏం చెబుతోంది..? పాక్‌లోకి చైనా సైన్యం చేరుకుందా..? ప్రత్యేక కథనం..
CPEC: అగ్ర రాజ్యం చైనా వడి వడిగా పావులు కదుపుతోంది. భారత్ సరిహద్దులే టార్గెట్‌గా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా ఇండియా చుట్టూ సైనికులకు మోహరిస్తోంది. ఇటీవల శ్రీలంకలోని హంబన్ టోట రేవును 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. ఈక్రమంలోనే యువాన్ వాంగ్-5 నిఘా నౌకను పంపింది. తాజాగా పాకిస్థాన్‌ను చైనా టార్గెట్ చేసింది. పాకిస్థాన్‌లోని సీపెక్‌గా పిలవబడే కారిడార్ రక్షణకు సైనిక దళాలను పంపేందుకు చైనా సిద్ధమవుతోంది.
ఈమేరకు అంతర్జాతీయ, జాతీయ కథనాలు వెలువడుతున్నాయి. ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడుతామన్న నెపంతోనే అక్కడే ఔట్ పోస్ట్‌లు నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. ఈనేపథ్యంలో ఔట్ పోస్ట్‌ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని పాక్‌పై ఒత్తిడి తేస్తోంది. ఈవిషయాన్ని పాక్ అధికారులు వెల్లడిస్తున్నారు. పాక్, అఫ్ఘనిస్థాన్‌లో సైనికులను మోహరించాలని భావిస్తోంది. ఔట్ పోస్టులు ఏర్పాటు అయితే బెల్ట్ అండ్ రోడ్ పనులకు మరింత సులువు అవుతుందని జిన్‌పింగ్ సేన ఆలోచిస్తోంది.
ఇందులోభాగంగా వీటిపై చర్చించేందుకు చైనా రాయబారి నాంగ్ రోంగ్..పాకిస్థాన్‌లో పర్యటించారు. ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో, ఆర్మీ చీఫ్ కమర్ జావెద్ బజ్వాలతో సమావేశమయ్యారు. ఔట్ పోస్టుల అనుమతిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈఏడాది మార్చి వరకు పాక్‌లో చైనా రాయబారి లేరు. ఇటీవల చైనా రాయబారి రోంగ్ అక్కడికి చేరుకున్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంతో వీటిపై మంతనాలు జరిపారు.
చైనా దూకుడుతో అంతర్జాతీయ సమాజంలో గందరగోళం నెలకొంది. గద్వార్‌లో ఔట్ పోస్టులు ఏర్పాటు చేసుకుంటామని..అంతర్జాతీయ విమానాశ్రయంలోకి తమ యుద్ధ విమానాలు వచ్చేలా చూడాలని ఇదివరకే పాక్‌ను చైనా కోరింది. ఇందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకారం చెప్పినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతమంతా కంచెను నిర్మించారు. త్వరలో చైనా ఆధీనంలోకి వెళ్తుందని ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్ట్‌లు నిర్మించేందుకు చైనా వ్యూహాలు రచిస్తోంది.
డ్రాగన్ తీరుతో పాకిస్థాన్ ప్రజల్లో కలవరం మొదలైంది. చైనా పాలనలోకి వెళ్తామా అన్న ఆందోళన చెందుతున్నారు. ఇటు తాలిబన్లు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పాకిస్థాన్‌కు దూరంగా ఉంటున్నారు. బీఆర్‌ఐ ప్రాజెక్ట్‌ను అఫ్ఘనిస్థాన్ మీదుగా మధ్య ఆసియాలోకి విస్తరించాలని చైనా ఆలోచిస్తోంది. ఈక్రమంలో తాలిబన్ల ఇలాకాలోనూ సైనిక స్థావరాలు ఏర్పాటు చేయాలనుకుంటోంది.
మొత్తంగా పాక్, చైనా తీరుపై ఉగ్రవాద సంస్థలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చైనీయులపై ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే పాక్‌లో తమ వారికి భద్రత లేదని చైనా అంటోంది. అందుకే సైనిక స్థావరాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటోంది. ఏదిఏమైనా త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.
Also read:CM Kcr: దేశాన్ని విడగొట్టే కుట్రలు జరుగుతున్నాయి..సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్..!
Also read:Nassar: సినీ నటుడు నాజర్‌కు గాయాలు..ఆస్పత్రికి తరలింపు..!
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook