China Earthquake: భారీ భూకంపంతో చైనాలో కలకలం రేగింది. వాయువ్య చైనాలోని గాన్సూ క్విన్‌ఘాయ్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదైన ఈ భూకంపంలో 111 మంది మరణించగా 200 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాయువ్య చైనాలోని గాన్సూ క్విన్‌ఘాయ్ ప్రాతంంలో సోమవారం అర్ధరాత్రి భూమి భారీగా కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా స్థానిక మీడియా పేర్కొంది. అమెరికా జియోలాజికల్ సర్వే మాత్రం 5.9 తీవ్రత అని అంచనా వేసింది. అయితే ఈ భూకంపం కారణంగా చైనాలోని గాన్సూ రాష్ట్రంలో తీవ్రంగా ఆస్థి, ప్రాణనష్టం జరిగినట్టు అంచనా. అర్ధరాత్రి కావడంతో చాలామంది నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి రోడ్లపైకి పరుగులు తీశారు. జనం భయంతో రోడ్లపై పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం ధాటికి చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకూ 111 మంది మరణించగా, 200 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. 


చైనా భూకంపం కారణంగా విద్యుత్ లైన్లు, కమ్యూనికేషన్, రవాణాకు ఆటంకం కలిగిందని స్థానిక మీడియా పేర్కొంది. భూకంపం సంభవించిన గాన్సూ రాష్ట్రం బీజింగ్‌కు నైరుతి దిశలో 1450 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో చైనాలోని సిచువాన్ ప్రాంతంలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 46 మంది మరణించారు. ఆ సమయంలో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి.


Also read: Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం, కరాచీ ఆసుపత్రిలో చికిత్స, ఇంటర్నెట్ డౌన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook