పాకిస్తాన్‌కు చైనా మరోసారి షాక్ ఇచ్చింది. చైనా ప్రభుత్వం నడిపే సీజీటీఎన్ టీవీ ఓ వార్తను ప్రసారం చేస్తూ.. ఆక్రమిత కాశ్మీరు భారత భూభాగంలో ఉన్నట్లు చూపించింది. అయితే ఇది ఆశ్చర్యకరమైన వార్త కాదని అనుకొనేవారు కూడా ఉన్నారు. కాకపోతే.. ఓ చైనా మీడియా తొలిసారిగా ఇలా చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. చిత్రమేమింటే.. చైనా గతంలో విడుదల చేసిన మ్యాప్‌ల్లో ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా పీఓకే భారత్‌లో ఉన్నట్లు చూపించకపోవడంతో.. ఇప్పుడు చైనా ప్లేటు ఎందుకు ఫిరాయించిందా? అని అందరూ నిజంగానే షాక్‌కు గురవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 భారత్-చైనా సైన్యం కలిసి డిసెంబరు 10వ తేదిన మిలట్రీ డ్రిల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వార్త రావడంతో.. చైనా వ్యుహమేమై ఉంటుందా? అన్న కోణంలో కూడా రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. అయితే తాజాగా చైనా మీడియా సంస్థ విడుదల చేసిన వార్త కూడా సామాన్యమైనదేమీ కాదోండయ్? కరాచీలో చైనా కాన్సులేట్ పై పలువురు దాడి చేసిన వార్తను ప్రసారం చేస్తూ.. దేశాల మ్యాపును టీవీలో చూపిస్తున్నప్పుడు.. అందులో ఆక్రమిత కాశ్మీరు భారత్‌లో ఉన్నట్లు చైనా మీడియా ప్రసారం చేసింది. 


ఈ మధ్యకాలంలో పాకిస్తాన్‌లోని పలువురు చైనీయుల మీద దాడులు జరుగుతున్న సందర్భంలో.. పాకిస్తాన్ దేశానికి హెచ్చిరిక జారీ చేయడానికే చైనా ప్రభుత్వం ఇలా యుక్తులు వేస్తుందా? అని కూడా ఆలోచించాలని పలువురు వార్తా విశ్లేషకులు చెబుతున్నారు.