Chinese man: ఉద్యోగ రాక్షసం.. వీక్లీ ఆఫ్ లేకుండా వరుసగా 104 రోజులు పనిచేసిన ఉద్యోగి తీవ్ర అనారోగ్యంతో మృతి..ఎక్కడంటే..?
Chinese man dies after working 104 days : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 104 రోజులు వరుసగా పని చేయడంతో అనారోగ్యం పారిన పడి ఒక కార్మికుడు మృతి చెందిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలింది చైనాలో జరుగుతున్న ఈ ఘటనతో పెరుగుతున్న పని ఒత్తిడి పై సర్వత్ర చర్చ నడుస్తోంది. అసలు ఈ ఘటన పూర్వపరాలు ఏంటో తెలుసుకుందాం.
Chinese man dies after working 104 days : వ్యాపార విలువల ముందు మానవ విలువలకు అర్థం లేకుండా పోతుంది. పలు కంపెనీల ధనదాహానికి చిరు ఉద్యోగులు కనీస హక్కులు నోచుకోకుండా బలైపోతున్నారు. తాజాగా చైనాలో జరిగిన ఓ విషాద ఘటనలో ఓ కార్మికుడు 104 రోజులపాటు సెలవు తీసుకోకుండా పనిచేయడంతో అతడు మల్టిపుల్ ఆర్గాన్ డిసార్డర్ తో మరణించాడు. ఈ 104 రోజుల్లో అతడు కేవలం ఒక్కరోజు మాత్రమే సెలవు తీసుకున్నాడు. దీంతో అతడు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై న్యాయస్థానానికి వెళ్లగా ఉద్యోగి మరణించడానికి 20 శాతం బాధ్యత యాజమాన్యానిది కూడా ఉందని కోర్టు తీర్పు చెప్పింది.
పూర్తి వివరాల్లోకెళ్తే వృత్తిరీత్యా పెయింటర్ అయిన బాధితుడు అబావో 104 రోజులపాటు వరుసగా పని చేయడంతో అతడికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో పాటు పలు అవయవాలు ఎఫెక్ట్ అయ్యాయి. చివరికి గత ఏడాది జూన్ నెలలో అతడు తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. ఈ విషయాన్ని మార్నింగ్ పోస్ట్ తన రిపోర్టులో తెలిపింది.
జేజాంగ్ రాష్ట్రంలో పనిచేస్తున్నబాధిత కార్మికుడు కాంట్రాక్టులో భాగంగా వరుసగా పనిచేస్తానని ఒప్పుకోవాల్సి వచ్చింది. దీంతో పని భారం పెరిగింది. అతను 2023 ఫిబ్రవరి నుంచి మే నెల వరకు 104 రోజుల పాటు పనిచేశాడు. అంతేకాదు అతను కేవలం 2023 ఏప్రిల్ 6వ తేదీ ఒక్కరోజు మాత్రమే సెలవు తీసుకున్నాడు. మే 25వ తేదీన అనారోగ్యం పాలవగా మే 28వ తేదీన ఆసుపత్రిలో చేరాడు. ఇక జూన్ 1, 2023వ సంవత్సరం ఆసుపత్రిలో న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్ కారణంగా అతడు మరణించాడు.
అయితే దీనిపై అబావో కుటుంబం మాత్రం యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే బాధితుడు మృతి చెందినట్లు కేసు నమోదు చేసి న్యాయస్థానానికి వెళ్లారు. తాము చేసుకున్న కాంట్రాక్ట్ ప్రకారం బాధిత కార్మికుడు సెలవు తీసుకోకుండా పనిచేస్తానని ఒప్పుకున్నట్లు కంపెనీ వాదించింది. అయితే కోర్టు మాత్రం యాజమాన్యం అతడికి ఆరోగ్యం భద్రత కల్పించడంలో విఫలం చెందిందని తీర్మానించింది. అంతేకాదు చైనాలో ఉన్న కార్మిక చట్టం ప్రకారం రోజుకు గరిష్టంగా ఎనిమిది గంటలు పని వారానికి 44 గంటలు మాత్రమే పని చేయించుకోవాల్సి ఉంటుంది.
ఈ చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు కోర్టు తీర్మానించింది ఇందుకుగాను బాధితుడి కుటుంబానికి 4 లక్షల యువాన్లు ( 47 లక్షల రూపాయలు) అలాగే అతడి కుటుంబం అనుభవించిన మానసిక క్షోభకి గాను పదివేల యువాన్లు పరిహారం చెల్లించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇదిలా ఉంటే వైద్య నిపుణులు మాత్రం కార్మికులకు ఎనిమిది గంటల పని, ఎనిమిది గంటల కుటుంబ జీవితం, 8 గంటల నిద్ర తప్పనిసరి అని సూచిస్తున్నారు. లేకపోతే శరీరంలో అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.