Poisonous letter: ఆ దేశాధ్యక్షుడిని చంపేందుకు విషం పూసిన లేఖ
Poisonous letter: రాచరికపు యుగంలో రాజుల మధ్య విద్వేషాలుండేవి. తుదముట్టించేందుకు రకరకాల పద్ధతులు అవలంభించేవారు. విషపు కత్తులు, విష బాణాలు, లేఖలకు విషం పూయడం వంటి పద్ధతులుండేవి. ఇప్పుడు కూడా అదే జరిగింది.
Poisonous letter: రాచరికపు యుగంలో రాజుల మధ్య విద్వేషాలుండేవి. తుదముట్టించేందుకు రకరకాల పద్ధతులు అవలంభించేవారు. విషపు కత్తులు, విష బాణాలు, లేఖలకు విషం పూయడం వంటి పద్ధతులుండేవి. ఇప్పుడు కూడా అదే జరిగింది.
అతన్ని అంతం చేసే కుట్ర జరిగింది. రాచరికపు హయాంలో జరిగినట్టే. లేఖకు విషం పూసి మరీ చంపేందుకు ప్రయత్నించారు. ట్యునీషియా దేశాధ్యక్షుడు కైస్ సయీద్ ( Tunisia president kais saied ) కు ఓ లేఖ వచ్చింది. అతని సహాయకురాలైన నదియా ఆ లేఖను తెరిచి చూసింది. అందులో ఖాళీ పేపర్ మాత్రమే ఉండటంతో అనుమానం కలిగింది. ఓ రకమైన వాసన వచ్చి..ఆమె కళ్లు మంటపెట్టాయి. తలనొప్పి వచ్చి..నీరసపడిపోయింది. అలా అస్వస్థకు గురవడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై లేఖను దూరంగా పెట్టి..ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉందని తెలిసింది.
ట్యూనీషియా ( Tunisia ) అధ్యక్షుడు కైస్ సయీద్‌ను హతమార్చేందుకు కుట్ర జరిగిందని అర్ధమైంది. లేఖకు విషం పూసి పంపించారని నిపుణులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించారు. దేశాధ్యక్షుడు కైస్ సయీద్‌ను హతమార్చేందుకు కుట్ర జరిగిందని తెలియగానే దేశంలో కలవరం ప్రారంభమైంది. దాంతో దేశాధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు. విషపు లేఖ ( Poisonous letter ) తో తనకేం కాలేదని...ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించారు. ఎవరూ కంగారు పడవల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు భద్రతా దళాలు విషపు లేఖపై దర్యాప్తు ప్రారంభించారు.
Also read: H1B Visa: హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు Joe Biden భారీ ఊరట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook