పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్..POKలో పాకిస్తాన్ మరోసారి నీచబుద్ధి ప్రదర్శించింది. ఇప్పటికే సహాయం పేరుతో సామాగ్రి పంపించిన   పాకిస్తాన్ అధికారులు .. పీవోకేలోని స్థానిక దుకాణదారులకు వాటిని అమ్ముకున్నారు. అంతే కాదు సహాయ సామాగ్రి అవసరం ఉన్న వారు దుకాణదారుల నుంచి కొనుక్కోవాలని సూచించారు. ఈ ఘటన మరువక ముందే .. పాకిస్తాన్ నీచబుద్ధి మరోసారి బయటపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్తాన్.. ఆక్రమించుకున్న భూభాగం గిల్గిత్  బాల్టిస్తాన్. ఇక్కడ  పాకిస్తాన్ అధికారమే రాజ్యమేలుతోంది. ఐతే అక్కడి ప్రజలకు అండగా నిలవాల్సిన పాక్ సర్కారు... నీచంగా వ్యవహరించింది. కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ఇలా నీచంగా  వ్యవహరించడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తోంది. ఇరాన్ నుంచి పాకిస్తాన్‌కు చేరుకున్న యాత్రికులను .. పాకిస్తాన్‌లో ఉండనివ్వకుండా .. వారిని గిల్గిత్ బాల్టిస్తాన్‌కు తరలించారని అక్కడి సామాజిక  కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీని వల్ల గిల్గిత్ బాల్టిస్తాన్‌లో కరోనా వైరస్  పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.


ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 215గా ఉంది.  తాజాగా ఇరాన్ నుంచి యాత్రికులను అక్కడికి తరలించడంతో పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా  పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం గిల్గిత్ బాల్టిస్తాన్‌లో 'కరోనా'కు చికిత్స చేసేందుకు పెద్దగా వసతులు అందుబాటులో లేవు. వైద్యుల సంఖ్య తక్కువగా ఉంది. సరైన ఆస్పత్రులు లేవు. మందులు అందుబాటులో లేవు. ఇలాంటి సమయంలో ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..