Philippines typhoon: ఫిలిప్పీన్స్​ను రాయ్ తుపాన్(Rai Typhoon) అతలాకుతలం చేసింది.  మృతుల సంఖ్య 208కి చేరింది. ఒక్క బోహోల్​ రాష్ట్రంలోనే 100కి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఈ తుపాను ఫిలిప్పీన్స్​(Philippines)ను అంధకారంలోకి నెట్టింది. కోలుకోలేని స్థితికి చేర్చింది. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందిపై తుపాను ప్రభావం చూపించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ తుపాన్ ధాటికి విద్యుత్ వ్యవస్థ ధ్వంసమయ్యింది. సమచార, రవాణ స్తంభించి పోయింది. వేలాది ఇళ్లు, భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. చెట్లు, ఇళ్ల పైకప్పులపై ప్రజలు బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. ఫిలిప్పీన్స్​ ప్రెసిడెంట్​ రొడ్రిగో డుటెర్టే(Rodrigo Duterte) దెబ్బతిన్న పలు ప్రాంతాలను సందర్శించారు. 2 బిలియన్​ పెసోస్​(40 మిలియన్​ డాలర్లు) సాయం ప్రకటించారు. 


Also Read: Philippines Rai Typhoon: ఫిలిప్పీన్స్​లో 'రాయ్​' బీభత్సం- 100 దాటిన మృతుల సంఖ్య!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook