Etihad Airways: ఒమిక్రాన్ వేరియంట్ భయం ఇప్పుడంతా వెంటాడుతోంది. అంతర్జాతీయ రాకపోకల విషయంలో వివిధ దేశాలు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు ఢిల్లీ ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు(Omicron Cases)పెరుగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్ అప్పుడే 46 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా వేయికి పైగా కేసులు వెలుగు చూశాయి. ఇండియాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 25 కు చేరింది. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్ సంక్రమణ నేపధ్యంలో వివిధ ప్రభుత్వాలు అంతర్జాతీయ ప్రయాణాలు, రాకపోకలపై ప్రత్యేక మార్గదర్శకాలు విధించాయి. ఇతర దేశాల ఎయిర్‌వేస్ అన్నీ ఈ మార్గదర్శకాల్ని స్పష్టంగా పాటించాలి. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కోవిడ్ 19 మార్గదర్శకాల్ని రూపొందించింది.


అంతర్జాతీయ రాకపోకల విషయమై కోవిడ్ 19 మార్గదర్శకాల్ని(Covid19 Guidelines)పాటించనందుకు దుబాయ్‌కు చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు ఢిల్లీ ప్రభుత్వం షోకాజ్ నోటీసు పంపింది. విమానాశ్రయంలో విదేశాలనించి వచ్చే ప్రయాణీకుల కోసం జారీ చేసిన మార్గదర్శకాల్ని పాటించని ఈ కేసులో ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు(Etihad Airways)చెందిన రెండు విమానాలకు నోటీసులు జారీ అయ్యాయి. నిబంధనల ప్రకారం అబూదాబి నుంచి ఢిల్లీకు చేరుకున్న విమానంలోని 2 శాతం ప్రయాణీకులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే అలా జరగకపోవడంతో ఢిల్లీ వసంత్ విహార్ ఎస్డీఎస్ ఈ నోటీసులు జారీ చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 నిబంధనలకు కట్టుబడి ఉండకపోవడం తీవ్రంగా పరిగణించే విషయం. ఇండియన్ పీనల్ కోడ్(IPC)సెక్షన్ 188 ఇతర వర్తించే చట్టాలు విధించాల్సి వస్తుందని నోటీసులో స్పష్టం చేశారు. 


Also read: Mystery Hut on Moon: చంద్రుడి ఉపరితలంపై 'మిస్టరీ హట్'.. గుర్తించిన చైనా మూన్ రోవర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook