అప్ఘనిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు!

కాబూల్‌కి ఉత్తరాన 212 కిమి లోతున భూకంప కేంద్రం
న్యూఢిల్లీ: అప్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. హిందూ కుశ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 5:34 గంటల సమయంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.1గా నమోదైనట్టుగా భారత వాతావరణ శాఖ స్పష్టంచేసింది. కాబూల్‌కి ఉత్తరాన 212 కిమి లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ భూకంపం తీవ్రత కారణంగా ఢిల్లీతోపాటు ఉత్తర భారత్‌లోనూ పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.