Earthquake hits Alaska Coast in US: అలస్కా: అమెరికాలోని అలాస్కా నైరుతి తీరంలో భారీ భూకంపం ( Earthquake ) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంపం తీవ్రత 7.5 నమోదైంది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1:54 గంటలకు ఈ భూకంపం సంభవించినట్టు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం తీవ్రత భారీగా ఉండటంతో భూకంపం తరువాత అమెరికా ప్రభుత్వం సునామీ హెచ్చరికలు ( Tsunami warning alerts ) జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యుఎస్ జియోలాజికల్ సర్వే ( US Geological Survey ) వెల్లడించిన వివరాల ప్రకారం అలస్కాలోని సాండ్ పాయింట్‌కు ఆగ్నేయంగా 55 మైళ్ళ దూరంలో సుమారు 25 మైళ్ళు లోతున భూకంపం కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. భూకంపం తర్వాత కూడా 5.8, 5.7, 5.2, 5.5 మాగ్నిట్యూడ్స్ తీవ్రతతో పలుసార్లు భూమి కంపించింది. Also read : India invites Australia: చైనాకు మరో భారీ షాక్.. ఆస్ట్రేలియాకు భారత్ ఆహ్వానం


అలస్కాలో ( Alaska ) గత 4 నెలల కాల వ్యవధిలో ఈ స్థాయి భూకంపం సంభవించి సునామి హెచ్చరికలు జారీ చేయడం ఇది రెండోసారి. జులై 22న సైతం అలస్కాలోని యాంకరేజ్ నగరానికి నైరుతి దిశలో 804 కిమీ దూరంలో ఇదే తరహాలో 7.4 మ్యాగ్నిట్యూడ్‌తో భూకంపం సంభవించిన అనంతరం అమెరికా సర్కార్ సునామి హెచ్చరికలు జారీచేసింది. అప్పుడు అలస్కాలోని చిగ్నిక్‌కి దక్షిణాన 75 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని గుర్తించినట్టు అమెరికాకు చెందిన నేషనల్ ఒషెనిక్ అండ్ అట్మాస్పేర్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రం వెల్లడించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe