Earthquake: ఇండోనేషియాలో మళ్లీ కంపించిన భూమి, భయంతో జనం పరుగులు
Earthquake: భూకంపాలకు నిలయమైన ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. టొబెలోకు వాయువ్యంగా 162 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో జనం భయంతో పరుగులు తీశారు.
ఇటీవల గత కొద్దిరోజులుగా ఇండోనేషియాలోని వివిధ ప్రాంతాల్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. రిక్టర్ స్కేలుపై ఈసారి 5.5 తీవ్రత నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
గత వారం పదిరోజుల్నించి ఇండోనేషియాలో భూమి కంపిస్తోంది. 1-2 సార్లు సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. ఇప్పుడు మరోసారి టొబెలోకు వాయవ్యంగా 162 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సముద్రమట్టానికి 12 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. అంతకుముందు అంటే జనవరి 16వ తేదీన ఇండోనేషియాలో 6.2 తీవ్రతతో భూ అంతర్భాగంలో 151 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇండోనేషియాలోని సింగ్‌కిల్ నగరానికి ఆగ్నేయంగా 40 కిలమీటర్ల దూరంలో..సముద్రమట్టానికి 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది.
మరోవైపు తూర్పు జావా ప్రావిన్స్‌లో అగ్నిపర్వతం పేలిన ఘటనలో ఒకరు మరణించగా 40 మందికి గాయాలయ్యాయి. పలు గ్రామాలు, నగరాలను ఖాళీ చేయించారు. సెమెరు పర్వతం పేలిన ఘటన ఇది.
ఇక ఉత్తరాఖండ్‌లో సైతం భూమి కంపించింది. పితోర్‌గఢ్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదైంది. సముద్రమట్టానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. దేశంలోని ఢిల్లీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో తరచూ 3-3.8 తీవ్రతతో భూమి కంపిస్తూనే ఉంటుంది.
Also read: Battle Tanks: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ ట్యాంకులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook