ఫిలిప్పీన్స్ లో ఈ రోజు భూప్రంపనలు సంభవించాయి. బటనెస్ నగరానికి సమీపంలో  ఐదు గంటల  వ్యవధిలో భూమి రెండు స్లారు కంపించింది. వరుస భూకంపాలు స్థానికంగా జన జీవనాన్ని అస్థవ్యస్తం చేసింది. స్థానిక మీడియా కథనం ప్రకారం భూకంప ప్రభావంతో అక్కడ ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇల్లు , కార్యాలయాలు నేలమట్టయ్యాయి. ఎందరో శిధిలాకింద చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అత్యవసర సేవల సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.


అధికారులు ఇచ్చిన దాని ప్రకారం ఇప్పటి వరకు ఈ రోజు సంబవించిన భూకంపం వల్ల  8 మంది మృతి  చెందగా 60 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల తరలింపునకు ప్రత్యేక  విమానంతో పాటు హెలికాఫ్టర్లను ఏర్పాటు చేశారు. అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ రోజు తెల్లవారు ఝామున బటనెస్ నగరానికి సమీపంలో భూకంపం సంభవించింది.  రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత  5.7,  5.9 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.