దుబాయ్‌: దుబాయ్‌లో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందగా అందులో 8 మంది భారతీయులు ఉన్నట్టు అక్కడి భారతీయ కాన్సూలేట్ జనరల్ కార్యాలయం ప్రకటించింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రంజాన్ సెలవులు ముగించుకుని ఒమన్ నుంచి తిరిగొస్తుండగా షేక్ మహ్మద్ బిన్ జయేద్ రోడ్డు వద్ద గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన భారతీయులను రాజగోపాలన్, ఫిరోజ్ ఖాన్ పఠాన్, రేష్మ ఫిరోజ్ ఖాన్ పఠాన్, దీపక్ కుమార్, జమాలుద్దీన్ అరక్కవీట్టిల్, కిరణ్ జానీ, వాసుదేవ్, తిలక్‌రామ్ జవహార్ థాకూర్ ఉన్నారు. 


మృతుల తాలుకా బంధువులకు ఎప్పటికప్పుడు అక్కడి సమాచారం అందిస్తున్నట్టు దుబాయ్‌లోని ఇండియన్ కాన్సూలేట్ జనరల్ కార్యాలయం ట్విటర్ ద్వారా ప్రకటించింది.