Elon Musk: ప్రపంచ కుబేరుడుగా ఎలాన్ మస్క్.. ఆయన సంపద విలువెంతో తెలుసా?
Elon Musk Is Worlds Richest Person: టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు.
Elon Musk Is Worlds Richest Person: టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. 500 మంది కుబేరులతో బ్లూమ్‌బర్గ్ రూపొందించిన బిలియనీర్స్ జాబితా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ పేరిట, జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ ఎల్ఎల్‌సీ పేరిట ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన కంపెనీలు నిర్వహిస్తుండగం గమనార్హం.
ఎలాన్ మస్క్ సంపద నికర విలువ గురువారం నాటికి 188.5 బిలియన్ డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.14.13 లక్షల కోట్లు. ఈ సంపద విలువతో అక్టోబర్ 2017 నుంచి అపర కుబేరుడిగా కొనసాగుతున్న అమెజాన్(Amazon) వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించాడు. ఎలాన్ మస్క్(Elon Musk)కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా విలువ గురువారం 7.4 శాతం పెరిగి.. 811 డాలర్ల గరిష్ట స్థాయికి చేరడంతో ఆయన అత్యంత ధనవంతుడు అయ్యారు.
Also Read: Cheapest Data Plans: ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్ మరియు విఐ బెస్ట్ ప్లాన్స్ ఇవే..
గత ఏడాది ఎలాన్ మస్క్(Elon Musk) సంపద విలువ ఏకంగా 150 బిలియన్ డాలర్లకు పైగా పెరగడం గమనార్హం. ఆయనకు చెందిన టెస్లా కంపెనీ షేర్ల విలువ ఏడాది వ్యవధిలో ఏకంగా 743శాతం మేర పెరిగింది. ఇది టయోటా, ఫోక్స్ వ్యాగన్, జీఎం మరియు ఫోర్డ్ కలిపినా.. దాని కన్నా అధిక విలువైన కార్ల కంపెనీ విలువతో సమానం.
Also Read: 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్.. ఆసక్తికర విషయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook