ఇప్పటికే డేటా చోరీ, డేటా బదిలీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్ నెత్తిన తాజాగా 'బగ్' బండరాయి పడింది. మే 18-27 తేదీల్లో ఫేస్‌బుక్‌లో ఓ బగ్ యాక్టివ్ అయి 14 మిలియన్ల యూజర్ల ప్రైవసీ సెట్టింగులు వారికి తెలియకుండా మార్చగా వారు 'ప్రైవేట్'గా చేసిన పోస్టులు పబ్లిక్ అయి ఇతరులకు కనిపించాయి. బగ్‌ను గురువారం గుర్తించిన కంపెనీ ప్రస్తుతం సమస్యను ఫిక్స్ చేశామంది. బగ్ బాధిత యూజర్లను సెట్టింగుల మార్పుకై సమాచారం ఇస్తామంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డేటా బదిలీ ఆరోపణలపై ఫేస్‌బుక్ వివరణ కోరిన కేంద్రం


యూజర్ల వ్యక్తిగత వివరాలను మొబైల్ కంపెనీలకు అందించిందనే ఆరోపణలపై ఫేస్‌బుక్‌ని కేంద్రం వివరణ కోరింది. కాగా యూజర్లు వారి స్నేహితుల వివరాలు తెలుసుకునేందుకు 60 మొబైల్ ఉత్పత్తి కంపెనీలకు ఫేస్‌బుక్ డేటా బదిలీ అనుమతి ఇచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఇందులో యాపిల్, బ్లాక్ బెర్రీ, శాంసంగ్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలూ ఉన్నాయి. కేంబ్రిడ్జి అనలిటికాకు డేటా బదిలీ నేపథ్యంలో ఈ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.