Joe Biden: చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఎఫ్‌బీఐ చేతికి రహస్య పత్రాలు
US President Joe Biden Secret Documents: యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఇంట్లో ఎఫ్‌బీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ ఈ సోదాల్లో 6 రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 13 గంటల పాటు సాగాయి. బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ వాడిన ల్యాప్‌టాప్ ఆయనకు సమస్యలు తెచ్చిపెట్టింది.
US President Joe Biden Secret Documents: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కొడుకు హంటర్ బైడెన్ వాడిన ఓ ల్యాప్‌టాప్ సమస్యలు తెచ్చిపెట్టింది. శుక్రవారం డెలావేర్‌లోని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో 6 రహస్య పత్రాలను స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు బైడెన్ చేతితో రాసిన పేపర్లను కూడా ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి తరపు న్యాయవాది శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సోదాలు 13 గంటల పాటు సాగాయని వెల్లడించారు. అమెరికా న్యాయ శాఖ ఈ స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలిస్తోంది.
తన వద్ద రహస్య పత్రాలు అత్యంత భద్రంగా ఉన్నాయని.. ఓ సీల్డ్ డబ్బాలో భద్రపరిచినట్లు ఇటీవల బైడెన్ తెలిపారు. అయితే ఆయన ప్రకటన చేసిన వారంలోనే న్యూయార్క్ పోస్టు పత్రిక ఓ సంచలన వార్తను ప్రచురించింది. అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన ఈ రహస్య పత్రాలు బైడెన్ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నట్లు కథనం రాసింది. ఆ రహస్య పత్రాలు అక్కడ ఉన్న టైమ్‌లోనే బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ పలుమార్లు ఆ ఇంటికి వచ్చినట్లు పేర్కొంది.
జో బైడెన్ 1973 నుంచి 2009 వరకు డెలావేర్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఒబామా పరిపాలనలో 2009 నుంచి 2017 వరకు వైస్ ప్రెసిడెంట్ పదవిని నిర్వహించారు. బైడెన్ 'ప్రామిస్ మి, డాడ్' అనే పుస్తకం రాసే సమయంలో అమెరికా వైట్ హౌస్ నుంచి ఈ రహస్య పత్రాలను తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆయన వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన పదవీకాలానికి సంబంధించిన కొన్ని రహస్య పత్రాలను బైడెన్ ఇంటి నుంచి ఎఫ్‌బీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో సోదాలు చేసినప్పుడు జో బైడెన్, జిల్ బైడెన్ ఇంట్లో లేరు. డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లోని తమ ఇంట్లో వీకెండ్ పార్టీలో ఉన్నారు.
ఉదయం 9.45 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో న్యాయ శాఖ, అధ్యక్షుడి న్యాయ బృందాలు, సీనియర్ వైట్ హౌస్ అధికారులు ఉన్నారు. తన ఇంట్లో తనిఖీలు నిర్వహించేందుకు జో బైడెన్ పూర్తిగా అనుమతి ఇచ్చారని ఆయన వ్యక్తిగత న్యాయవాది వెల్లడించారు. ఈ విషయం పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
వెలుగులోకి ఇలా..
యూఎస్‌లోని డెలావేర్‌లోని జాన్‌పౌల్ మాక్ లాసక్ అనే వ్యక్తి కంప్యూటర్ రిపేర్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతని వద్దకు 2019 ఏప్రిల్ నెలలో కొన్ని ల్యాప్‌టాప్‌లు రీపేర్ కోసం వచ్చాయి. వాటిపై బీయూ బైడెన్ ఫౌండేషన్ అని స్టిక్కర్లు ఉండగా.. వాటిలో నుంచి డేటా తీసి ఇవ్వాలని ల్యాప్‌టాప్‌లు తీసుకువచ్చిన వ్యక్తి చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ల్యాప్‌టాప్‌లను పరిశీలించిన లాసన్.. అందులోని డేటాను రికవరీ చేశాడు. అయితే రీపేర్ కోసం ఇచ్చిన వ్యక్తి తిరిగి రాలేదు.
డేటాను చెక్ చేయగా.. బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ మత్తుమందులు వాడుతున్న ఫొటోలు, ఇతర వీడియోలు, మెయిల్స్ కనిపించాయి. ఆ ల్యాప్‌టాప్ ఇచ్చి వెళ్లింది హంటర్ బైడెనే అని అనుకున్న లాసన్.. 2019 డిసెంబర్‌లో ఎఫ్‌బీఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఆ ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేకున్నారు. అయితే ఆయన అప్పటికే వాటిలోని సమాచారాన్ని కాపీ చేసి.. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు సన్నిహితుడైన రూడీ గులియాని న్యాయవాది రాబర్ట్ కొస్టెల్లోకు ఇచ్చాడు. ఆయన ఈ హార్డ్‌డ్రైవ్‌ను న్యూయార్క్ పోస్టుకు అందజేశారు. 2020లో న్యూయార్క్ పోస్టు వీటిపై కథనాలు ప్రచురించింది. బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న టైమ్‌లో అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించింది. అప్పట్లో ఈ వార్తలు పెను సంచలనం రేపాయి. మళ్లీ ఇప్పుడు తనిఖీలు నిర్వహించడం కలకలం రేపుతోంది.
Also Read: Rohit Sharma: గ్రౌండ్‌లోకి దూసుకువచ్చిన బాలుడు.. రోహిత్ శర్మ చెప్పిన ఆ ఒక్క మాటతో..
Also Read: Smita Sabharwal: సీఎంవో అధికారిని స్మితా సబర్వాల్ ఇంట్లోకి దూరిన డిప్యూటీ తహసీల్దార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook